రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము భద్రాచలం రామయ్యను దర్శించుకున్నారు. భద్రాద్రిలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రులు పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్, జిల్లా ఉన్నతాధికారులు రాష్ట్రపతికి స్వాగతం పలికారు. భద్రాద్రి పర్యటనకు విచ్చేసిన రాష్ట్రపతికి ఐటీసీలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ దగ్గర మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్,సత్యవతి రాథోడ్ స్వాగతం పలికారు. అనంతరం శ్రీ సీతా లక్ష్మణ సమేత భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు.
ఆలయ మర్యాదలతో అర్చకులు, వేద పండితులు రాష్ట్రపతికి స్వాగతం పలికారు. భద్రాచలం ఆలయంలో ముర్ము ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ‘ప్రసాద’ పథకం కింద చేపట్టిన పలు అభివృద్ధి పనులకు రాష్ట్రపతి శంకుస్థాపన చేశారు. భద్రాచలంలో రాష్ట్రపతి పర్యటన సందర్భంగా గిరిజనులు సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. సమ్మక్క, సారలమ్మ గిరిజన పూజారుల సమ్మేళనం కార్యక్రమాన్ని భద్రాచలంలో నిర్వహించారు. అంతకుముందు ఏకలవ్య ఆదర్శ పాఠశాలను రాష్ట్రపతి ముర్ము వర్చువల్ గా ప్రారంభించారు.