అన్నల దాడిలో పది మంది పోలీసులు బలి

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో మావోయిస్టులు పోలీసులపై దాడి చేశారు. మందుపాతర దాడిలో డ్రైవర్‌ సహా 10 మంది పోలీసులు మృతి చెందారు. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG) సిబ్బంది వాహనాన్ని టార్గెట్ చేసుకుని మందుపాతర పేల్చారు. అర్ణపూర్‌లో ఈ ఘటన జరిగినట్టు అధికారులు వెల్లడించారు.  ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బగేల్ స్పందించారు. పోలీసుల మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం భూపేష్‌కి ఫోన్ చేసి మాట్లాడారు. కేంద్రం నుంచి అవసరమైన సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

Leave a Reply

%d