లీకు రాయుళ్లు విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారు. పబ్లిక్ పరీక్షలు అంటే చాలు.. లీకు రాయుళ్లు రెచ్చిపోతారు. పేపరును ముందుగానే లీక్ చేసి.. పరీక్షల కోసం 24 గంటలూ కష్టపడి చదువుకున్న విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. పరీక్ష పేపర్ల లీకు రాయుళ్లు విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారు. పబ్లిక్ పరీక్షలు అంటే చాలు.. లీకు రాయుళ్లు రెచ్చిపోతారు. పేపరును ముందుగానే లీక్ చేసి.. పరీక్షల కోసం 24 గంటలూ కష్టపడి చదువుకున్న విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. పరీక్షల నిర్వహణ కోసం అధికారులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా ఈ లీకులకు అడ్డుకట్ట మాత్రం లేదు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. అయితే ఓ వైపు పరీక్ష కొనసాగుతుండగా.. తాజాగా పేపర్ లీకేజ్ కలకలం సృష్టించింది. వికారాబాద్ జిల్లాలోని తాండూరులో ప్రశ్న పత్రం లీకు కలకలం రేపింది. నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షలకు అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. ప్రశ్నపత్రం లీక్ వంటి ఘటనలు జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా లీక్ వ్యవహారం చోటుచేసుకుంది. వికారాబాద్ జిల్లాలోని తాండూరులో పదో తరగతి ప్రశ్నపత్నం లీకైనట్లు సమాచారం. పరీక్ష ప్రారంభమైన కొన్ని క్షణాల్లోనే ప్రశ్నపత్రం బయటకు వచ్చింది. పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కాగా.. 9.37 నిమిషాలకే వాట్సాప్ లో ప్రశ్నపత్రం ప్రత్యక్షమైంది. అయితే ఈ ప్రశ్నపత్రం తాండూరులోని ఓ పరీక్ష కేంద్రం నుంచి లీకైనట్లు సమాచారం. అయితే పేపర్ లీకైనట్లు వస్తున్న వార్తలపై వికారాబాద్ జిల్లా డీఈవో స్పందించారు. తమ జిల్లాలో పేపర్ లీక్ కాలేందటూ వివరణ ఇచ్చారు. అయితే ప్రశ్నపత్రం లీక్ వార్తలతో విద్యార్థుల తల్లిదండ్రులో ఆందోళన ఏర్పడింది.
పదో తరగతి ప్రశ్న పత్రం లీక్
