మార్చిలో బ్యాంకులకు 12 రోజులు సెలవు, లిస్ట్‌ ఇదిగో

మార్చికి నెలలో మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులు మూసివేసి ఉంటాయి. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం రెండు నాలుగు శనివారాలు బ్యాంకులు పనిచేయవు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మార్చి 2023 కోసం బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. వివిధ పండుగలు, రెండు, నాల్గవ శనివారాలు, నాలుగు ఆదివారాలతో సహా మొత్తం 12 సెలవులు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో బ్యాంకు సేవల్లో ఎలాంటి అసౌకర్యం లేకుండా మార్చి నెలలో రాబోయే బ్యాంక్ సంబంధిత పనులు ఉన్న వ్యక్తులు సెలవు క్యాలెండర్‌ను సమీక్షించి ప్లాన్‌ చేసుకుంటే ఉత్తమం. ఇవి మన ప్రాంతానికి వర్తిస్తాయో లేదో చెక్‌ చేసుకోవాలి. అలాగే ఆన్‌లైన్, మొబైల్, నెట్ బ్యాంకింగ్ సేవలు ఎలాగూ అందుబాటులో ఉంటాయి.

మార్చి నెలలో బ్యాంకు సెలవుల జాబితా
మార్చి 3 శుక్రవారం: చాప్‌చార్ కుట్ సందర్భంగా మణిపూర్‌లోని బ్యాంకులకు సెలవు
మార్చి 5 – ఆదివారం
మార్చి 7 -హోలీ (2వ రోజు)
మార్చి 8 – ధూలేటి/డోల్జాత్రా/హోలీ/యోసాంగ్ 2వ రోజు
మార్చి 9 -హోలీ
మార్చి 11 – నెలలో రెండవ శనివారం
మార్చి 12 – ఆదివారం
మార్చి 19 – ఆదివారం
మార్చి 22 – ఉగాది
మార్చి 25 – నాలుగో శనివారం
మార్చి 26 – ఆదివారం
మార్చి 30 – శ్రీరామ నవమి

Leave a Reply

%d