ఐబాకో తన 200 స్టోర్ హైదరాబాద్ లో ప్రారంభించింది. ఐబాకో అనేది హ్యాట్సన్ ఆగ్రో ప్రొడక్ట్ లిమిటెడ్ చెందిన ప్రత్యేకమైన రుచి కలిగిన ఐస్ క్రీమ్‌లు, ఐస్ క్రీమ్ కేకులు, ఐస్ క్రీమ్ షేక్స్ మరియు సిగ్నేచర్ బార్‌లకు ప్రసిద్ధి చెందిన ప్రీమియం ఐస్ క్రీం బ్రాండ్. నగరంలోని ప్రగతినగర్‌లోని ప్రజలకు అందుబాటులో తీసుకవచ్చారు.
ఈ సందర్భంగా హ్యాట్సన్ ఆగ్రో ప్రొడక్ట్ లిమిటెడ్ చైర్మన్ ఆర్.జి.చంద్రమోగన్ మాట్లాడుతూ.. ఐబాకో అనేది మా బ్రాండ్. ప్రత్యేకమైన మరియు ఎప్పుడూ రుచి చూడని రుచులను తీసుకురావడానికి తాము ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. 200వ అవుట్‌లెట్‌ను ప్రారంభించడం ద్వారా మేము ఒక మైలురాయిని చేరుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు.