మరో సీరిస్ పై కన్నేసిన టీం ఇండియా

వన్డే వరల్డ్‌కప్‌ సన్నాహకాల్లో ఉన్న టీమిండియా ఈ ఏడాది వరుసగా రెండో సిరీ్‌సను ఖాతాలో వేసుకోవాలనుకుంటోంది. దీంట్లో భాగంగా శనివారం న్యూజిలాండ్‌తో రెండో వన్డే ఆడనుంది. ఇటీవలే రోహిత్‌ సేన శ్రీలంక జట్టును క్లీన్‌స్వీ్‌ప చేసిన విషయం తెలిసిందే. అటు హైస్కోరింగ్‌ థ్రిల్లర్‌గా నిలిచిన ఉప్పల్‌ మ్యాచ్‌లో కివీస్‌ ఏడో నెంబర్‌ బ్యాటర్‌ బ్రేస్‌వెల్‌ అసాధారణ ఆటతీరుతో ముచ్చెమటలు పట్టించాడు. గిల్‌ డబుల్‌ సెంచరీతో భారత్‌కు భారీ స్కోరు అందించినా ఓ దశలో అదీ తక్కువే అనిపించింది. అందుకే ఈ మ్యాచ్‌ మనోళ్లకు అంత సులువు కాబోదు. ఎలాంటి అలక్ష్యానికి తావీయకుండా చెలరేగితేనే సిరీస్‌ దక్కుతుంది. మరోవైపు గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో నెంబర్‌ వన్‌ టీమ్‌ కివీస్‌ తమ స్థాయికి తగ్గట్టుగా ఆడాలనుకుంటోంది.

Leave a Reply

%d