పెరియాంపుల్లరీ కలిపి కేన్సర్ వచ్చిన రోగికి కిమ్స్ ఐకాన్ ఆస్పత్రి వైద్యులుఅత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్స చేసి ఊరట కల్పించారు. ఆమె సమస్యను, చేసిన చికిత్స వివరాలను ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు, డాక్టర్ ప్రసాద్ ఎర్రా తెలిపారు.
‘‘విశాఖపట్నం ప్రాంతానికి చెందిన 58 ఏళ్ల సరస్వతి అనే మహిళకు బరువు తగ్గడం, కామెర్లు, ఒంటి మీద దురదల్లాంటి సమస్యలతో కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి వచ్చారు. ఆమెకు వివిధ వైద్యపరీక్షలు చేయగా, పెరియాంప్యులరీ కార్సినోమా అని తేలింది. పాంక్రియాస్ (క్లోమం)తో పాటు పిత్తనాళం (బైల్ డక్ట్), ఆంత్రమూలం (డువోడెనమ్) తదితర ప్రాంతాలకు కేన్సర్ వ్యాపిస్తే, దాన్ని పెరియాంప్యులరీ కార్సినోమా అంటారు. సాధారణంగా పాంక్రియస్‌కు కేన్సర్ సోకితే శస్త్రచికిత్స చేయడమే చాలా సంక్లిష్టం. అయినా, దీన్ని కూడా కేవలం ఉదరభాగంలో చిన్న రంధ్రాలు మాత్రమే చేసి లాప్రోస్కోపిక్ పద్ధతిలో శస్త్రచికిత్స చేశాం. దీన్ని విపుల్స్ పాంక్రియాటికో డియోడెనెక్టమీ అంటారు. ఇది చాలా అత్యాధునికమైన పద్ధతి. మొత్తం ఏడు గంటల పాటు ఈ శస్త్రచికిత్స చేసి, కేన్సర్ సోకిన భాగాలన్నింటినీ పూర్తిగా తొలగించారు . సర్జరీ తరువాత 8 రోజుల్లో పూర్తిగా కోలుకున్న తరువాత డిశ్చార్జ్ చేసాం . బయటకు తీసిన భాగాలను బయాప్సీకి పంపగా, ఎలాంటి మార్జిన్లు లేకుండా మొత్తం తీసేసినట్లు తెలిసింది. మేం పరీక్షల్లో నిర్ధారించినట్లుగానే ఇది పెరియాంప్యులరీ కార్సినోమా అని తేలింది. ఇప్పుడు ఆమె కేన్సర్ మళ్లీ రాకుండా ఉండేందుకు కీమోథెరపీ తీసుకుంటున్నారు.
ఇలాంటి సంక్లిష్టమైన శస్త్రచికిత్సలను ఏపీలోనే చాల అరుదుగా చేస్తారు,దీనికి ఈ రంగంలో నైపుణ్యంతో పాటు అత్యాధునిక శస్త్రచికిత్స పరికరాలూ అవసరం అవుతాయి. కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో ఇలాంటి సంక్లిష్టమైన శస్త్రచికిత్సలు చేసేందుకు వైద్యులతో పాటు సదుపాయాలు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు ఐదు లాపరోస్కోపిక్ విప్పల్ ప్యాంక్రియాటికోడోడెనెక్టమీ సర్జరీస్ చేసారు.