ఆయన వయసు దాదాపు 80 ఏళ్లు. సమాజంలో మంచి పేరు ప్రతిష్ఠలున్న వ్యక్తి. కానీ ఐదేళ్లుగా ఆయన సరిగా నడవలేకపోతున్నారు, మెడ నిలబెట్టలేకపోతున్నారు. వెన్నెముక, మెడ కలిసి గట్టిగా కర్రలా అయిపోవడంతో ఆయన మెడ కిందకు వాలిపోయింది. ఈ సమస్య వల్ల మూడేళ్ల నుంచి నిద్ర కూడా సరిగా ఉండట్లేదు. వైద్యపరిభాషలో దీన్ని యాంకీలోజింగ్ స్పాండిలైటిస్ అంటారు. సాధారణంగా మన వెన్నెముక కావల్సిన చోట కొంత వంపు తిరిగి ఉంటుంది. ఇలా వంపు తిరగకుండా తిన్నగా గట్టిబడిపోవడం వల్ల మెడను నిలబెట్టలేకుండా ముందుకు వాల్చేయాల్సి వస్తుంది. దానివల్ల ఎదురుగా ఉన్న వస్తువులను చూడలేరు, సరిగా నడవలేరు, పడుకోలేరు. ఈ సమస్యలతో పలు ఆస్పత్రుల చుట్టూ తిరిగిన ఆ వయోవృద్ధుడు.. చివరకు కొండాపూర్‌లోని కిమ్స్ ఆస్పత్రికి వచ్చారు. అక్కడ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్, స్పైన్ సర్జన్ డాక్టర్. కె. శ్రీకృష్ణ చైతన్య ఆయనకు పలురకాల వైద్య పరీక్షలు చేశారు.
For More News Click: https://eenadunews.co.in/
ఈ సమస్యకు పరిష్కారం ఉంది గానీ, అది అత్యంత సంక్లిష్టమైనది, చాలా రిస్కుతో కూడుకున్నది. దాంతో రోగికి, ఆయన కుటుంబ సభ్యులకు పెడికిల్ సబ్‌ట్రాక్షన్ ఆస్టియోటమీ అనే ఈ శస్త్రచికిత్స గురించి డాక్టర్ కె.శ్రీకృష్ణ చైతన్య వివరించారు. ఇది అత్యంత అధునాతనమైన శస్త్రచికిత్స గానీ, ఇందులో రిస్కు చాలా ఎక్కువగా ఉంటుంది. నేవిగేషన్ లాంటి అత్యాధునిక సదుపాయాలు ఉండటం, నైపుణ్యం కలిగిన వైద్యులు కూడా అందుబాటులో ఉండటంతో శస్త్రచికిత్స చేయొచ్చని తెలిపారు.
For More News Click: https://eenadunews.co.in/
ఈ శస్త్రచికిత్సలో భాగంగా వెన్నెముకలోని కొంత భాగాన్ని తొలగించి, అవకరాన్ని సరి చేస్తారు. ఇందులో కోణాలను అత్యంత జాగ్రత్తగా లెక్కించాలి. ఏ మాత్రం చిన్న తేడా వచ్చినా రోగికి శాశ్వతంగా ఇబ్బందులు వస్తాయి. మొత్తం అన్ని కోణాలను అత్యంత అప్రమత్తతతో లెక్కించిన తర్వాత వెన్నెముకలోని ఎల్3 భాగం నుంచి 30 డిగ్రీల ఎముకను తొలగించాలని నిర్ణయించారు. దానివల్ల వెన్నెముక మళ్లీ సాధారణ స్థాయికి వచ్చి, మెడను మామూలుగా నిలబెట్టగలిగే పరిస్థితి ఉంటుంది.
For More News Click: https://eenadunews.co.in/
ముందుగా రోగి వెన్నెముకకు సంబంధించిన 3డి ప్రింటింగ్ తీసుకుని, అవకరానికి సంబంధించిన అన్ని కోణాలనూ లెక్కించారు. కంప్యూటర్ నేవిగేషన్ సహాయంతో శస్త్రచికిత్స ప్రారంభించారు. ఇందుకు ప్రత్యేకమైన ఆపరేషన్ టేబుల్‌ను కూడా వినియోగించారు. ఇంట్రా ఆపరేటివ్ న్యూరల్ మానిటరింగ్ ద్వారా మొత్తం శస్త్రచికిత్స జరిగింది. దీనికి 8 గంటల సమయం పట్టగా, 1500 మిల్లీలీటర్ల రక్తం పోయింది. దాన్నంతటినీ తిరిగి ఎక్కించడంతో రోగి పూర్తిగా కోలుకున్నారు. శస్త్రచికిత్స జరిగినంతసేపూ ఆయనకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా మత్తువైద్య నిపుణులు సైతం అత్యంత అప్రమత్తంగా వ్యవహరించారు.
For More News Click: https://eenadunews.co.in/
శస్త్రచికిత్స అనంతరం రోగి పూర్తిగా కోలుకున్నారు. ఆయన మెడ కూడా ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకుంది. ఈ శస్త్రచికిత్స ద్వారా తనకు మళ్లీ ప్రాణం పోశారని ఆ వయోవృద్ధుడు ఆనందం వ్యక్తం చేశారు.