వెయిట్ లాస్ కోసం వచ్చే ఒంటరి మహిళల్ని ట్రాప్ చేసి వీడియో కాల్స్ రికార్డ్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని కె.పి.హెచ్.బి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హెర్బా లైఫ్ కంపెనీలో మార్కెటింగ్ మేనేజరుగా పని చేసేవాడు వక్కలపాటి చంద్రశేఖర్ అనే వ్యక్తి. వెయిట్ లాస్ కోసం తన వద్దకు వచ్చిన మహిళల ఫోన్ నెంబర్లు సేకరిస్తాడు. వారికి మెసేజ్లు, ఫోన్ కాల్ చేస్తూ చనువు పెంచుకొని.. వారి వ్యక్తిగత వివరాలు సేకరించి అసభ్యకరమైన మెసేజ్లు పంపిస్తూ వేధించేవాడు.
For More News Click: https://eenadunews.co.in/
మరి కొందరిని నమ్మించి వీడియో కాల్స్ మాట్లాడుతూ వాటిని రికార్డ్ చేసేవాడు. ఈ విధంగా ఓ మహిళను వేధిస్తూ, బ్లాక్ మెయిల్ పాల్పడుతుండటంతో ఆ బాధితురాలు కె.పి.హెచ్.బి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చంద్రశేఖర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
గతంలో కూడా చంద్రశేఖర్ ఇదే విధంగా రాయదుర్గం పరిధిలో ఓ మహిళను ట్రాప్ చేసి వీడియో కాల్స్ తో లొంగతీసుకొని, రెండు కోట్ల రూపాయలు వసూలు చేసి, ఆమెపై హత్య యత్నానికి పాల్పడటంతో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించినట్లు సమాచారం. మహిళలు కొత్త వారితో జాగ్రత్తగా ఉండాలని, వ్యక్తిగత వివరాలు పంచుకోవటం, న్యూడ్ కాల్స్ మాట్లాడటం లాంటివి చేయవద్దని కె.పి.హెచ్.బి సిఐ కిషన్ కుమార్ సూచించారు.