భారీగా తగ్గిన సిలిండర్ ధర

ప్రతి నెల ఒకటో తేదీన ఎల్పీజీ గ్యాస్ ధరల్లో మార్పులు చేస్తున్న ఆయిల్ కంపెనీలు మరోసారి ధరలను తగ్గించాయి.  19  కేజీల  కమర్షియల్ సిలిండర్ ధర రూ.171.50 మేర తగ్గిస్తున్నట్లుగా ప్రకటించాయి.  దీంతో ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1856.50కు చేరుకుంది. . కోల్‌కతాలో ఈ సిలిండర్ రేటు 1960కు దిగి రాగా,  ముంబైలో ఈ సిలిండర్‌ ధర రూ. 1808గా ఉంది. చెన్నైలో చూస్తే.. ఈ సిలిండర్ ధర రూ. 2021 వద్దక కొనసాగుతోంది.

For More News Click: https://eenadunews.co.in/

ఏప్రిల్ నెలలో కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర దాదాపు రూ. 350 మేర దిగి వచ్చింది.  గృహ అవసరాల కోసం వాడే  సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.  ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో ఎల్పీజీ ధర రూ.1103కి చేరింది. ముంబైలో అయితే ఈ రేటు రూ. 1112గా ఉంది. ఇంకా చెన్నైలో అయితే రూ. 1118 చెల్లించాలి.

ఇక  మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే..  14.2 కేజీల సిలిండర్ ధరను కొనాలంటే ఇప్పుడు రూ. 1161 చెల్లించాలి. ఏపీలో ఈ రేటు వర్తిస్తుంది. అదే హైదరాబాద్‌లో చూస్తే.. సిలిండర్ ధర రూ. 1155 వద్ద కొనసాగుతోంది. ఈ ధరలకు అదనంగా  డెలివరీ చార్జీలు కూడా ఉంటాయి.  అన్నీ కలుపుకుంటే రూ. 1200 కు చేరుకుంటుంది.

Leave a Reply

%d bloggers like this: