సీడబ్ల్యూసీ గైడ్ లైన్స్ ప్రకారమే పోలవరం ప్రాజెక్టు డ్యామ్ ఎత్తు ఉంటుందన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై వస్తున్న అపోహలను ఎవరూ నమ్మొద్దని సీఎం జగన్ కోరారు. ఏపీ అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్టుపై స్వల్పకాలిక చర్చకు ఏపీ సీఎం వైఎస్ జగన్ సమాధానం ఇచ్చారు. 45.7 మీటర్లు ఎత్తు వరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందని సీఎం జగన్ హామీ ఇచ్చారు. సీడబ్ల్యూసీ సిఫారసు మేరకు తొలి దశలో 41.15 మీటర్ల ఎత్తు వరకు కడతామని సీఎం జగన్ చెప్పారు. పోలవరం ప్రాజెక్టుపై ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తుందని సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయమై తాను ఇటీవల ప్రధానిని కలిసినట్టుగా ఆయన వివరించారు.
నిబంధనల ప్రకారమే పోలవరం – జగన్
