కృతి శెట్టి.. ఫస్ట్ ఫిలిం ‘ఉప్పెన’తో కుర్రకారు గుండెల్లో గూడు కట్టేసుకుంది. గ్లామర్, టాలెంట్, డ్యాన్స్‌తో టాప్ స్టార్ అవుతుందనుకున్నారంతా. వరుసగా ఆఫర్స్ అయితే వచ్చాయి కానీ కెరీర్ అనుకున్నంత సాఫీగా అయితే సాగలేదు. ‘శ్యామ్ సింగరాయ్’ పర్వాలేదనిపించింది. ‘బంగార్రాజు’ మినహాఇస్తే.. ‘ది వారియర్’, ‘మాచర్ల నియోజకవర్గం’, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, ‘కస్టడీ’ ఇలా వరుసగా ఒకదాన్ని మించి మరోటి సూపర్ ఫ్లాప్స్ కొట్టింది. ప్రస్తుతం శర్వానంద్ 35తో పాటు మలయాళంలో ఓ సినిమా చేస్తోంది. ఇటీవల తమిళంలో సూర్య, కార్తి చిత్రాల్లో అవకాశాలొచ్చాయని అంటున్నారు. అయితే ఈమధ్య ఓ ఇంటర్వూలో కృతి తనను ఓ స్టార్ హీరో కొడుకు టార్చర్ చేస్తున్నాడంటూ చేసిన వ్యాఖ్యలు ఫిలిం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.
ఓ కోలీవుడ్ స్టార్ హీరో కొడుకు కృతి శెట్టితో ఫ్రెండ్‌షిప్ చెయ్యాలని తెగ ట్రై చేస్తున్నాడట. అంతేకాదు, ఆమె అటెండ్ అయ్యే ప్రతీ ఈవెంట్‌లోనూ వెంటపడుతూ ఇబ్బంది పెడుతున్నాడంట. ఎక్కడికెళ్తే అక్కడికి ‘ఐ వాన్నా ఫాలో ఫాలో యూ’ అంటూ నీడలా వచ్చేస్తున్నాడట. ఈమధ్య షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని తన బర్త్‌డే పార్టీకి రావాలని, పార్టీకి వస్తే ఎన్ని కోట్లైనా ఇస్తానని ఆఫర్ చేశాడట. దీంతో కృతి శెట్టి షాక్ అయిందట. ఈ విషయాలన్నీ ఓ కోలీవుడ్ మీడియాకిచ్చిన ఇంటర్వూలో చెప్పుకొచ్చిందామె. అయితే ఆ స్టార్ హీరో తెలుగు వ్యక్తా?, తమిళ్ వ్యక్తా?.. అతని కొడుకు కూడా హీరోనా?, కాదా? అంటూ నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.