విద్య వ్యవస్థలో కేంద్రం సంచలన నిర్ణయాన్ని తీసుకవచ్చింది. చిన్నారులపై చదువులు ఒత్తిడి భారాన్ని తగ్గించింది. విద్యార్థుల అడ్మిషన్లపై కేంద్రం కొత్త రూల్ ప్రవేశపెట్టనుంది. విద్యార్థుల వయసు ఆరు ఏళ్లు ఉంటేనే ఒకటో తరగతిలో అడ్మిషన్ ఉండాలని నిర్ణయించింది. ఈ మేరకు..ఈ నిబంధనను పాటించేలా చూడాలని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రవిద్యాశాఖ ఉత్వర్వులు జారీ చేసింది. కొత్త జాతీయ విద్యా విధానం (NEP) ప్రకారం, పునాది దశలో పిల్లలందరికీ (3 నుండి 8 సంవత్సరాల మధ్య) ఐదు సంవత్సరాల అభ్యాస అవకాశాలను కలిగి ఉంటుంది, ఇందులో మూడు సంవత్సరాల ప్రీస్కూల్ విద్య (నర్సరీ, ఎల్‌కేజీ,యూకేజీ) తర్వాత.. 1, 2 తరగతులు ఉంటాయి. పిల్లల శారీరక,మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చాలా చిన్న వయస్సులో పాఠశాలలకు పంపరాదని గత ఏడాది సుప్రీంకోర్టు సైతం వ్యాఖ్యానించింది.
ఆరేళ్లు ఉంటేనే ఒకటో తరగతిలో అడ్మిషన్
