నన్ను రహస్యంగా ఫోటోలు తీస్తున్నారు ఆలియభట్

అలియా భట్..తన ఇంటిపై ఇద్దరు వ్యక్తులు పెట్టిన రహస్య కెమెరా చూసి షాక్ అయ్యింది. ఇలాగేనా చేసేదంటూ సోషల్ మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ అభిమాన నటి నటుల గురించి తెలుసుకోవాలని అభిమానులకు ఎంతో ఆరాటం ఉంటుంది. ఇంట్లో వారు ఏంచేస్తుంటారు..ఎలా ఉంటారో తెలుసుకోవాలని ఆసక్తి కనపరుస్తుంటారు. తాజాగా అలియా అభిమానులు ఇద్దరు అలాగే తెలుసుకోవాలని ఏకంగా అలియా ఇంటి ఫై రహస్య కెమెరా పెట్టారు. ఈ విషయం తెలిసి అలియా షాక్ అయ్యింది. ఈ విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మీరు నన్ను ఆట పట్టిస్తున్నారా? నేను ప్రశాంతంగా నా ఇంటి వద్ద కుటుంబంతో గడుపుతున్నాను. నేను మధ్యాహ్నం సమయంలో ఇంట్లో కూర్చుని ఉన్నాను. ఆ సమయంలో ఎవరో నన్ను గమనిస్తున్నట్లు అనిపించింది. వెంటనే బయట వైపు చూసి ఒక్కసారిగా షాక్‌ అయ్యాను. ఎవరో ఇద్దరు వ్యక్తులు మా పక్క ఇంటి డాబాపై నుంచి నన్ను కెమెరాతో వీడియో తీస్తున్నారు. ఇది సరైనదేనా..? ఒకరి వ్యక్తిగత విషయాలపై గోప్యత పాటించరా? ఎలాంటి వారి మధ్య అయినా దాటకూడని గీత ఉంటుంది. మీరు ఈరోజు ఆ గీత దాటారు. మీరు మీ హద్దులు దాటి ప్రవర్తించారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పోస్టును ముంబయి పోలీసులను ట్యాగ్‌ చేసింది. దీనిపై పలువురు సెలబ్రెటీలు స్పందిస్తున్నారు. ఆలియాకు మద్దతుగా నిలుస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇందుకు పలువురు సినిమా తారాలు సైతం తమ మద్దతు ప్రకటించారు.

Leave a Reply

%d bloggers like this: