హాలీవుడ్ లోకి బాలీవుడ్ నటి అలియాభట్

అలియాభట్​ నటించిన ఆర్​ఆర్​ఆర్, బ్రహ్మాస్త్ర, గంగూబాయి కతియావాడి సినిమాలు బాక్సాఫీస్​ వద్ద విజయవంతమయ్యాయి. రిక్కి ఔర్​ రాణికి ప్రేమ్​ కహాని సినిమాలోని ఓ సాంగ్​ కోసం ప్రస్తుతం కశ్మీర్​లో షూటింగ్​ జరుగుతోంది. ఆమె తల్లి​సోనీ రాజదాన్, సోదరి షాహీన్​భట్, కూతురు రహతో వెళ్లింది.

ఈ మంచులో చీరకట్టుకుంటున్నానని, ఏ రకంగా చూసిన తన డ్రీమ్​నిజమైందని అలియా తెలిపారు. ఈ సినిమాకు కరణ్​జోహర్​డైరెక్షన్​లో చేయడం చాలా ఉత్సాహంగా ఉందని పేర్కొన్నారు. ఈ సినిమాలో ధర్మేంద్ర, షబానా అజ్మీ, జయాబచ్చన్ లీడ్​ రోల్స్​లో నటిస్తున్నారు. ఈ చిత్రం​జులై 28న రిలీజ్​ కానుంది. అలియా ఈ ఏడాది ‘హార్ట్​ ఆఫ్​ స్టోన్​ఎలాంగ్​సైడ్​గాల్​గడాట్​’అనే సినిమాతో హాలీవుడ్​లో ఎంట్రీ ఇవ్వబోతోంది. 2023లో వెరైటీస్ ఇంపాక్ట్‌ ఫుల్ ఇంటర్నేషనల్ ఉమెన్ జాబితాలో అలియా స్థానం పొందింది.

Leave a Reply

%d