పాదయాత్రలే పదవుతు తెచ్చిపెడుతాయా ?

పాదయాత్ర ఈ పదానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీ తన పాదయాత్రతో జీవం పోశారని చెప్పుకోవాలి. ఆయన మరుణాంతరం అతని కుమారుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. ఆ తరువాత జరిగిప పరిణామాల వల్ల రాష్ట్రం విడిపోవడం చంద్రబాబు పాదయాత్ర, టీడీపీ అధికారంలోకి రావడం జరిగింది. అనంతరం జగన్ అధికారంలోకి వచ్చారు. అయితే అధికారంలోని రావడానికి మూల కారణం. అయితే ఇప్పుడు తెలంగాణలో కూడా పాదయాత్ర పర్వం కొనసాగుతోంది. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని పలు పార్టీల నేతలు పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటీకే వైతెపా అధ్యక్షురాలు వైస్ షర్మిల ప్రజా ప్రస్థానం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సైతం ప్రజా సంగ్రామ యాత్ర పేరిట విడతల వారీగా పాదయాత్ర చేస్తూ వస్తున్నారు. అలాగే టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి హథ్ సే హథ్ పేరిట రీసెంట్ గా పాదయాత్ర మొదలుపెట్టారు. ఇప్పటికే పలు జిల్లాలో యాత్ర పూర్తి అవ్వగా ప్రజల నుండి విశేష స్పందన వస్తుంది. దీంతో మిగతా నేతలు సైతం పాదయాత్ర తో ప్రజల్లోకి వెళ్లాలని ఆలోచిస్తున్నారు.

ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత, సి‌ఎల్‌పి నాయకుడు భట్టి విక్రమార్క సైతం పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. మార్చిలో భట్టి పాదయాత్ర మొదలయ్యే అవకాశముందని తెలుస్తోంది. బాసరలో పాదయాత్ర ప్రారంభించనున్న భట్టి.. ఖమ్మంలో ముగించనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో మొత్తం 35 నియోజకవర్గాలు కవర్ అయ్యేలా ఆయన పాదయాత్ర కొనసాగనుంది. కాంగ్రెస్ నేతలంతా ఈ పాదయాత్రలో పాల్గొంటారని

Leave a Reply

%d bloggers like this: