బోరున ఏడ్చేసిన సమంత

అనారోగ్యం కారణంగా కొన్ని రోజుల పాటు అందరికీ దూరంగా ఉన్న సినీ నటి సమంత మళ్లీ ప్రజల ముందుకు వచ్చింది. ‘శాకుంతలం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ఆమె విచ్చేసింది.. వైట్ కలర్ శారీలో, కళ్లజోడు ధరించి ఆమె న్యూ లుక్ లో కనిపించింది. మరోవైపు ఈ సినిమా గురించి, తన గురించి దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతుండగా ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయింది. అమె కళ్ల నుంచి కన్నీళ్లు ఉప్పొంగాయి.  ఈ చిత్రంలో సమంతనే హీరో అని గుణశేఖర్ అన్నారనీ, ఈరోజు తాను ఎంతో శక్తిని తెచ్చుకుని ఈవెంట్ కు హాజరయ్యానని సమంత చెప్పారు. గుణశేఖర్ గారికి సినిమానే జీవితమని అన్నారు. తన అంచనాలకు మించి ఈ సినిమా ప్రేక్షకుల మన్ననలను పొందుతుందని చెప్పారు. ఈ సినిమాకు తనను ఎంపిక చేసిన గుణశేఖర్ కు ధన్యవాదాలు చెపుతున్నానని అన్నారు. ఈ సందర్భంగా గుణశేఖర్ మాట్లాడుతూ, ఈ సినిమాకు సమంతనే హీరో అని, కేవలం సమంతను నమ్మి దిల్ రాజు ఈ ప్రాజెక్టులో భాగమై, కోట్ల రూపాయలు పెట్టారని అన్నారు. ఈ మాటలతో సమంత తీవ్ర భావోద్వేగానికి గురై, కన్నీరు పెట్టుకుంది.

Leave a Reply

%d