తన రేటు పెంచిన యాంకర్ సుమ

టాలీవుడ్ స్టార్ యాంకర్ ఎవరంటే టక్కున వచ్చే పేరు సుమ. సుమ కనకాల మలయాళి అమ్మాయి అయినా.. తెలుగు గల గల మాట్లాడుతూ అందర్నీ తన వాక్ చాతుర్యంతో కట్టిపడుస్తుంది. ఏ సినిమా ఈవెంట్ అయినా సుమ ఉండాల్సిందే. అయితే తాజాగా సుమ తన రెమ్యునరేషన్ పెంచేసిందని టాక్ వస్తోంది. యాంకర్ సుమ కనకాల తెలుగు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చలాకైన మాటలతో గత 15 సంవత్సరాలుగా అలరిస్తున్నారు. టీవీ తెరపై ఆమె ఓ మెగాస్టార్. ఎంత పెద్ద షో అయిన ఏ మాత్రం బెదరకుండా తన మాటలతో రంజింప చేస్తూ ఆకట్టకుంటారు. సుమ జన్మత: మలయాళీ అయినా తెలుగింటి కోడలై.. మాటలతో మైమరిపిస్తున్నారు.

Leave a Reply

%d