షేక్ చేస్తున్న అందాల ‘దెయ్యం’!
ఇటీవల విడుదలైన హారర్ మూవీ మసూద ఎంతగా భయపెట్టిందో ఆడియెన్స్‌కు తెలిసిందే. ఈ మూవీలో నాజియా పాత్రలో నటించిన అమ్మాయి హడలెత్తించింది. సినిమాలో ఘోస్ట్ రోల్ ప్లే చేసిన ఈ బ్యూటీ.. బయట మాత్రం అందంతో ఆశ్చర్యపరుస్తోంది. మసూద మూవీతో ఫేమ్ అయిన ఈ అమ్మడికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరిగిపోయింది.
అన్నట్టూ.. ఈ బ్యూటీ ఎవరో కాదు. మన తెలుగు అమ్మాయే. గుంటూరు జిల్లాకు చెందిన అ బ్యూటీ పేరు బాంధవి శ్రీధర్.
మొదట మోడలింగ్‌లోకి ప్రవేశించిన ఈ బేబీ.. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
2019లో మిస్ ఇండియా ఫ్యాషన్ ఐకాన్, మిస్ ఆంధ్రప్రదేశ్ పోటీల్లో విజయం సాధించింది.
ఇక ప్రతిష్టాత్మక మిస్ ఇండియా పోటీల్లో రన్నరప్‌గా నిలిచింది. సినిమాల్లో ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్న తరుణంలో మసూద ఆఫర్ రావడంతో ఓకే చెప్పేసింది.
ఈ మూవీలో దెయ్యం పాత్రలో థియేటర్ ను వణికించిన బాంధవి.. సోషల్ మీడియాలో తన అందంతో షేక్ చేస్తోంది. లేటెస్ట్గా బ్లాక్ సారీలో ఈ బ్యూటీ పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్ అయ్యాయి. వీటిని చూసిన ఫ్యాన్స్ అల్టిమేట్ బ్యూటీ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ అమ్మడి ఫొటోలకు లైకుల వర్షం కురిపిస్తున్నారు.