రూ.5,999/-కే యాంజియోగ్రఫీ పరీక్ష

నగరంలోని ప్రధాన ఆస్పత్రులలో ఒకటైన అమోర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నగరం, చుట్టుపక్కల ప్రాంతాల వారి కోసం గుండె పరీక్షల ప్రత్యేక ప్యాకేజిని ప్రకటించారు. ఇందులో భాగంగా ఈసీజీ, 2డి ఎకో పరీక్షలతో పాటు గుండె వైద్య నిపుణుల కన్సల్టేషన్ రూ.499కే అందిస్తున్నారు. ఒకవేళ వైద్యులు యాంజియోగ్రఫీ అవసరమని చెబితే, ఆ పరీక్షను కూడా కేవలం రూ.5,999కే చేస్తామని ఆస్పత్రి ప్రతినిధులు వివరించారు. వీటితోపాటు మరేవైనా ఇతర పరీక్షలు అవసరమైనా వాటన్నింటి ధరల మీదా 20 శాతం రాయితీని ప్రకటించారు. ఈ ప్రత్యేక ఆఫర్ 2022 డిసెంబరు 1 నుంచి 2023 జనవరి 31 వరకు అమలులో ఉంటుంది. గుండె వైద్య పరీక్షలు చేయించుకోవాలనుకునే వారు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటలలోగా కూకట్ పల్లి వై జంక్షన్ సమీపంలో బాలాగనర్ మెట్రోస్టేషన్ దగ్గర గల అమోర్ ఆస్పత్రికి రావాల్సి ఉంటుంది. అయితే, ఇందుకు ముందుగానే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. మరిన్ని వివరాలకు +91 40 6606 9999 నంబరులో సంప్రదించాలని ఆస్పత్రి ప్రతినిధులు తెలిపారు.

గుప్పెడంత గుండె ప‌దిలం
జీవ‌న‌శైలి ప‌రిస్థితులు గ‌ణ‌నీయంగా మారుతున్న ప్ర‌స్తుత త‌రుణంలో ప్ర‌తి ఒక్క‌రూ త‌మ గుండె ఆరోగ్యాన్ని ప‌దిలంగా కాపాడుకోవాల‌ని అమోర్ ఆస్ప‌త్రి ఎండీ డాక్ట‌ర్ కిశోర్ రెడ్డి సూచించారు. ముఖ్యంగా కొవిడ్ అనంత‌ర కాలంలో ప‌లు ర‌కాల స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ని, శారీర‌కంగా చాలా బ‌లంగా, ఆరోగ్యంగా ఉండేవారు కూడా గుండెపోటుకు గుర‌వుతున్నార‌ని ఆయ‌న గుర్తుచేశారు. అందువ‌ల్ల ఏ ఒక్క‌రూ ఆరోగ్యాన్ని నిర్ల‌క్ష్యం చేయ‌డానికి వీల్లేద‌ని, ఎప్ప‌టిక‌ప్పుడు త‌గిన వైద్య‌ప‌రీక్ష‌లు చేయించుకుని, త‌మ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాల‌ని తెలిపారు. అమోర్ ఆస్పత్రిలో అత్యాధునిక స‌దుపాయాల‌తో పాటు, నిపుణులైన వైద్యులు ఉన్నార‌ని, అందువ‌ల్ల ఈ ప్ర‌త్యేక ప్యాకేజిని ఉప‌యోగించుకుని త‌గిన ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని ఆయ‌న చెప్పారు.

Leave a Reply

%d