అన్నమయ్య సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో భోగిపళ్ల మహోత్సవం

శ్రీ వేంకట అన్నమయ్య సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మీనాక్షి శ్రీనివాస్ నిర్వహణలో విశిష్ట భోగి . పండుగ సందర్భంగా నిజాంపేట ప్రాంతంలో గల శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి దేవాలయం నందు మహిళలు భక్తుల సమక్షంలో శ్రీకృష్ణ పరమాత్మకు భోగి పళ్ళను పోసే కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకురాలు మీనాక్షి శ్రీనివాస్ మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులతో శ్రీశ్రీశ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల నేటి 12వ తరం అన్నమయ్య వంశీకులు ఆచార్య పురుషులు శ్రీశ్రీశ్రీ హరి నారాయణ ఆచార్యుల వారి దివ్య ఆశీస్సులతో తెలంగాణ ప్రాంతంలోని దేవాలయాలలో సంస్కృతి సాంప్రదాయ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహణ, సత్సంగాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, అన్నమాచార్యుల కీర్తన విభావరులు నిర్వహిస్తున్నామని , ఈ సందర్భంగా తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మీనాక్షి శ్రీనివాస్ తో పాటు సభ్యులు టి. గాయత్రి, శార్వాణి, కళ్యాణి, స్వరూపారాణి మరియు దేవాలయ అర్చకులు శ్రీ గౌతమ్ శర్మ గారితో పాటు భక్తులు జానకి గారు, వైష్ణవి , శివేందు, యశ్వంత్, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించిన భక్తులందరికీ అభినందనలు తెలియజేశారు.

Leave a Reply

%d