నెల్లూరులో మరో ఎమ్మెల్యే వికెట్ డౌన్ ?

జగన్ సర్కార్ కి నెల్లూరు జిల్లా కలిసి రావడం లేదని చెప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే అధికంగా ఎమ్మెల్యేలు సీఎంపై, పార్టీపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. అంతేకాకుండా ఇటీవల జరిగిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ వేశారని ఆరోపణలు కూడా మూటగట్టుకోవడమే కాకుండా పార్టీని తొలగించారు. ఇప్పుడు  మరో ఎమ్మెల్యే  కూడా అదే బాటలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. వివరాల్లోకి వెళ్తే… నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.. 2012 నుండి జగన్ కు అండగా నిలిచిన సీనియర్ నాయకుడు. 2019 తర్వాత తనకు ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుంది అని ఆశించారు. మంత్రి పదవి అటుంచితే .. తనకు రావాల్సిన పెండింగ్ బిల్లులు కూడా రావట్లేదు అని అనుచరుల దగ్గర వాపోతున్నారు. అంతేకాకుండా పార్టీలో కనీస గౌరవం లేదు అని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  పార్టీ మారడం తప్ప తనకు వేరే మార్గం లేదని అనుచరులకు స్పష్టం చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.  టీడీపీ బీజేపీలలో ఒక పార్టీలో చేరే అవకాశం ఉందని అనుచరలు అంటున్నారు. ఈ విషయంపై మరికొద్ది రోజుల్లో మరికొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Leave a Reply

%d bloggers like this: