వైకాపా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సీఎం జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తు ఎన్నికల్లో తనకు సీఎం టికెట్టు ఇవ్వకపోవచ్చు అని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం జిల్లా సింగరాయికొండ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం బాలినేని చేసిన వ్యాఖ్యలు రాజకీయ దూమారం లేపుతున్నాయి. ”ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వచ్చే ఎన్నికల్లో మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పించే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో నాకు టికెట్ రాకపోవచ్చు. నా భార్య సచీదేవికి టికెట్ ఇస్తారేమో? నీకు సీటు లేదు. నీ భార్యకు ఇస్తామని సీఎం జగన్ అంటే నేనైనా చేసేదేమీ లేదు. ఈసారి మహిళలే.. అని తేల్చి చెబితే నేనైనా పోటీ నుంచి వైదొలగాల్సిందే. నియోజకవర్గ స్థాయి నేతలు విభేదాలు పక్కనపెట్టి పార్టీ గెలుపు కోసం కలిసికట్టుగా పని చేయాలి. జిల్లాలోని కొండేపి వైకాపా సమన్వయకర్త వరికూటి అశోక్ బాబు.. పార్టీ కార్యకర్తలు, నాయకులను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.ఈ వేదిక మీదుగా చెబుతున్నా.. పార్టీ గెలుపు కోసం అందరితో నడవాలి. 2019లో కొండేపి నియోజకవర్గంలో వైకాపా ఓటమిని చవిచూసింది. ఈ సారి మాత్రం ఎట్టిపరిస్థితుల్లో గెలిచి తీరాలి. వైకాపా జెండా ఎగురవేయాలి” అని బాలినేని శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
ఆనం బాటలో బాలినేని
