రోజా నీ కూజా పగిలిపోయిద్ది – అనిత

టీడీపీ తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత.. మంత్రి రోజాపై నిప్పులు చెరిగారు. రోజా నోరు అదుపులో పెట్టుకోకుంటే, ఏదో ఒకరోజు తెలుగు మహిళలు, తెలుగు తమ్ముళ్ల చేతిలో చావుదెబ్బలు తినడం ఖాయం అని హెచ్చరించారు. రాష్ట్రంలో జరిగే నేరాలు, ఘోరాలన్నింటికీ ఐరన్ లెగ్ రోజా, మహా ఐరన్ లెగ్ జగనే కారణమని ఆమె మండిపడ్డారు. యువగళం పేరుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో లోకేష్ ప్రజల కష్టాలను అడిగితెలుసుకుంటూ , జగన్ ప్రభుత్వం ఫై నేతలపై పలు విమర్శలు చేస్తూ వస్తున్నారు. అయితే పాదయాత్ర చేస్తున్న నారా లోకేశ్ పై ఏపీ మంత్రి రోజా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ వస్తున్నారు. తనను లోకేష్ జబర్దస్త్ ఆంటీ అని పిలిచినందుకు బదులుగా, లోకేశ్ ను అంకుల్ అని పిలుస్తానని రోజా పేర్కొన్నారు. దీనిపై వంగలపూడి అనిత మంత్రి రోజాపై మండిపడ్డారు.

రాష్ట్రాన్ని అవినీతిమయంచేసి దందాలు, కబ్జాలతో నెట్టుకొస్తూ, చెప్పులు మోయించే స్థితికి వచ్చినవాళ్ల గురించి మాట్లాడటానికి మాకే సిగ్గుగా ఉందంటూ రోజా ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు అనిత. సినిమాల్లో ఐరన్ లెగ్ శాస్త్రి అయితే, రాజకీయాల్లో ఐరన్ లెగ్ రోజా అని ఎద్దేవా చేసారు. కచ్చులూరు బోటు ప్రమాదంలో 56 మంది చనిపోవడం జగన్ లెగ్ ప్రభావమే అని ఆలాగే అన్నమయ్య ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకుపోయి 39 మంది చనిపోయి, రూ.1700 కోట్ల ఆస్తి నష్టం జరగడానికి ఆ లెగ్గే కారణం అంటూ జగన్ , రోజా ఫై విమర్శలు చేసారు. అంతే కాదు జంగారెడ్డిగూడెంలో 28 కల్తీ సారా మరణాలు, ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో 13మంది, ఏలూరులో నీరు తాగి 600 మంది ఆసుపత్రి పాలుకావడం సైకో రెడ్డి లెగ్ మహత్యమే అని , కలియుగ వేంకటేశ్వరస్వామి ఆలయమే మూతపడేలా చేసిన కరోనా మహమ్మారికి కారణం జగన్ రెడ్డి లెగ్ పుణ్యమే అని అలాంటి లెగ్ పట్టుకొనే రోజా… ఐరన్ లెగ్ అని లోకేశ్ ను అంటుందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.

Leave a Reply

%d