ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్ కానున్నాయి. మే 19 నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవోకి నోటీసు ద్వారా తెలియజేసింది. ప్రైవేటు ఆసుపత్రులకు ఇవ్వాల్సిన బకాయిలను చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో రేపటి నుంచి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు బంద్ కానున్నాయి. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
నేటి నుండి ఆరోగ్య సేవలు బంద్
