అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ భారత్‌లో అంతర్భాగమేః అమెరికా

భార‌త్‌, చైనా మ‌ధ్య ఉన్న మెక్‌మోహ‌న్ లైన్ ను అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దుగా భావిస్తున్న‌ట్లు అమెరికా తెలిపింది. అమెరిక‌న్ సేనేట్ తీర్మానం ప్ర‌కారం.. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ ఇండియ‌న్ భూభాగంలోనే ఉన్న‌ట్లు పేర్కొన్న‌ది. ప్ర‌స్తుతం ఇండో ప‌సిఫిక్ ప్రాంతంలో అత్యంత క్లిష్ట‌మైన ప‌రిస్థితులు ఉన్నాయ‌ని, ఇలాంటి ద‌శ‌లో మిత్ర దేశంతో ఇండియాకు తోడుగా ఉండాల‌ని భావిస్తున్న‌ట్లు అమెరికా సేనేట‌ర్ బిల్ హ‌గేర్టి తెలిపారు. సేనేట‌ర్ జెఫ్ మెర్క్లే కూడా తీర్మానం పాస్ చేసిన‌వారిలో ఉన్నారు . లైన్ ఆఫ్ యాక్చువ‌ల్ కంట్రోల్ వ‌ద్ద చైనా సైన్యం చేస్తున్న దుశ్చ‌ర్య‌ల‌ను ఖండిస్తున్నామ‌ని, త‌మ తీర్మానం ద్వారా ఇండియాలోనే అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ ఉన్న‌ట్లు స్ప‌ష్టం చేస్తున్నామ‌ని బిల్ హ‌గేర్టి చెప్పారు. ఇటీవ‌ల రెండు దేశాల స‌రిహ‌ద్దుల మ‌ధ్య ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొన్న నేప‌థ్యంలో.. మెక్‌మోహ‌న్ లైన్‌ను అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దుగా గుర్తిస్తున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. పీఆర్‌సీ భూభాగంలో అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ ఉన్న‌ట్లు చైనా చేస్తున్న వాద‌ల‌ను అమెరికా సేనేట్ తీర్మానం ఖండించింది. పీపుల్స్ రిప‌బ్లిక్ చైనా చాలా దూకుడుగా.. రాజ్య‌విస్త‌ర‌ణ కాంక్ష‌తో ముందుకు వెళ్లున్న‌ద‌ని ఆరోపించింది.

Leave a Reply

%d