ఆస్ట్రేలియా దేశంలో హిందు దేవాలయం హిందూ దేవాలయాలపై మరోమారు ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బ్రిస్బేన్లోని లక్ష్మి నారాయణ దేవాలయంపై ఖలిస్థానీ మద్దతుదారులు బీభత్సం సృష్టించారు. ఈ దాడులపై ఆలయ పూజారి సతీందర్ శుక్లా మాట్లాడుతూ.. కొందరు స్థానికులు, భక్తులు ఉదయం తనకు ఫోన్ చేశారని దేవాలయంలోకి కొందరు దుండగులు చొరబడి బీభత్సం సృష్టిస్తున్నారని తెలిపారన్నారు. సిక్ఫార్జస్టిస్(ఎస్ఎఫ్జే)కు సంబంధించిన కొందరు ఆస్ట్రేలియాలో ఇలాంటి దాడులకు పాల్పడి పూర్తి భారతీయులను ఉగ్రవాదులకు చిత్రీకరించే చేసే ప్రయత్నంలా కనిపిస్తుందని ఆస్ట్రేలియాలో హిందూ మానవాధికారుల అధికారిణి సారా గేట్స్ అనుమానం వ్యక్తం చేశారు. ఇంతకు ముందు కూడా శివుడు, విష్ణువు మందిరాలను ధ్వంసం చేశారు. గోడలపై ఉన్న దేవుళ్ల ఫోటోలను సైతం చించి పడవేశారు. ఆస్ట్రేలియాలోని తమిళనాడు వాసులు అత్యంత వైభవంగా నిర్వహించుకునే ‘థాయ్పొంగల్’ వేడుకలో భక్తుల దర్శనం అనంతరం గుర్తుతెలియని దుండగులు జనవరి 16న ఆలయంపై దాడి చేశారు. అంతకుముందు జనవరి 12న కూడా మరో స్వామినారాయణ మందిరంలో విధ్వంసం సృష్టించారు దుండగులు. మెల్బోర్న్లో ఉన్న ఇస్కాన్శ్రీకృష్ణ ఆలయాంలో కూడా దుండుగులు విధ్వంసం సృష్టించారు. ఆలయాలపై దాడుల విషయంపై భారత ప్రభుత్వం తీవ్రంగా ఆక్షేపించింది. దేవాలయాలపై దాడుల అంశాన్ని ఇటీవలే కాన్బెర్రీలో జరిగిన ఓ సదస్సులో కూడా భారత విదేశాంగ కార్యదర్శులు అక్కడి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయంపై ఉగ్రదాడి
