ఓనర్‌తో ఉద్యోగి `గే` రిలేషన్ చివరకి

బెంగళూరులోని కొద్ది రోజుల క్రితం ఓ వ్యాపారవేత్త దారుణ హత్యకు గురయ్యాడు. అతడి కొడుకు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. అర్థిక కారణాల వల్లే ఆ వ్యాపారవేత్త హత్యకు గురై ఉంటాడని పోలీసులు మొదట్లో భావించారు. అయితే విచారణలో షాకింగ్ కోణం వెలుగులోకి వచ్చింది. వ్యాపారవేత్తకు ఓ మగ ఉద్యోగితో ఉన్న స్వలింగ సంపర్కమే (Gay Relation) హత్యకు కారణమని బయటపడింది (Crime News).

బెంగళూరుకు (Bengaluru) చెందిన లియాకత్ (44) అనే వ్యక్తి అడ్వర్టైజింగ్ ఏజెన్సీ నడుపుతున్నాడు. అతడి కంపెనీలో ఇల్యాజ్ ఖాన్ (26) అనే యువకుడు పని చేస్తున్నాడు. స్వలింగ సంపర్కుడు అయిన లియాకత్ కరోనా సమయంలో ఇల్యాజ్‌తో రిలేషన్ పెట్టుకున్నాడు. అప్పట్నుంచి రెండేళ్లుగా ఇద్దరూ ఆ రిలేషన్‌ను కొనసాగిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఇల్యాజ్‌కు ఓ అమ్మాయితో పెళ్లి కుదిరింది. ఆ పెళ్లి చేసుకోవద్దని ఇల్యాజ్‌ను ఇలాకత్ బెదిరించేవాడు.

గత నెల 28వ తేదీ రాత్రి ఇద్దరూ మైసూర్ రోడ్డులోని ఓ పాత భవనంలో కలుసుకున్నారు. తనకు పెళ్లి కుదరిందని, ఇకపై రిలేషన్ వద్దని లియకత్‌కు ఇల్యాజ్ చెప్పాడు. అందుకు లియాకత్ అంగీకరించలేదు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన ఇల్యాజ్ సుత్తితో లియాకత్ తలపై బాదాడు. అనంతరం కత్తెర్లతో పొడిచి చంపి పారిపోయాడు. లియాకత్ కుమారుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఇల్యాజ్‌తో లియాకత్ అఫైర్ గురించి తెలుసుకున్నారు. చివరకు విచారణలో ఇల్యాజ్ తన నేరం అంగీకరించాడు (Gay partner kills Owner).

Leave a Reply

%d bloggers like this: