ధరిపల్లిలో బలగం సినిమా

బలగం సినిమా ఇప్పుడు తెలంగాన వ్యాప్తంగా బలంగా వినినిస్తున్న సినిమా పేరు. ఎల్డండ వేేణు చిత్రికరించిన ఈ సినిమా తెలుగు సినిమా ప్రపంచాన్నే మార్చేసింది అంటే అతియోశక్తి కాదు. బలగం సినిమా విడదలై చాలా రోజులైంది కానీ ప్రేక్షకుల నుండి వస్తున్న ఆదరణ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే తెలంగాణలోని అన్ని మారు మూల గ్రామాల్లో ఈ చిత్రాన్ని గ్రామస్థులంతా కలిసి చూస్తున్నారు. కుటుంబం కలహాలతో విడిపోయిన అన్నదమ్ములు, అక్క చెల్లెల్లు అందరూ కలిసిపోతున్న సంఘటనలు కూడా చూస్తున్నాం.

ఇక ఈ చిత్ర ప్రదర్శన మెదక్ జిల్లాలోని ధరిపల్లి గ్రామంలో సర్పంచ్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి చిత్రప్రదర్శన చేశారు. కుటుంబ విలువలు తెలిపే ఈ చిత్రం విశేష ఆదరణ సొంతం చేసుకుందని సర్పంచ్ సిద్దిరాంరెడ్డి పేర్కొన్నారు. కాగా ధరిపల్లి పలు  సినిమాల చిత్రీకరణ చేసుకోవడం విశేషం. ఇప్పటికే విరాటపర్వం, అసలేం జరిగింది, తోపాటు ఇతర సినిమాల షూటింగ్ ఈ గ్రామంలో జరిగాయి.

ఈ సినిమా చూసిన అనంతరం గ్రామస్థులు తమ ఆప్తులను, బంధువులను తలుచుకొని కన్నీటి పర్యాంతరమ్యారు. వెక్కి వెక్కి ఏడ్చి తమ వారిని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా తరతరాలు గుర్తుండి పోతుందని తెలిపారు.

ఫోటోలు – అవుడం మహేష్

Leave a Reply

%d