విశ్వవిజేతను చిత్తుగా ఓడించిన బంగ్లాదేశ్

2022 టీ20 ప్రపంచకప్ విజేత ఇంగ్లండ్ కు పసికూన బంగ్లాదేశ్ షాక్ ఇచ్చింది. సొంత గడ్డపై రెచ్చిపోయి ఆడిన బంగ్లాదేశ్, 3 మ్యాచుల సిరీస్ లో ఇంగ్లండ్ ను చిత్తుగా ఓడించి సీరీస్ ను కైవసం చేసుకుంది. మంగళవారం సిరీస్ లో ఆఖరి టీ20 ఆడిన బంగ్లా 16 పరుగుల తేడాతో ఇంగ్లండ్ పై గెలిచి సిరీస్ ను వైట్ వాష్ చేసింది. లిటన్ దాస్ (73, 57 బంతుల్లో) చెలరేగి ఆడటంతో బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో 158/2 స్కోరు చేసింది. లిటన్ దాస్ కు తోడు నజ్ముల్ శాంటో (47,36 బంతుల్లో) రాణించాడు. 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ సాల్ట్ (0) వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన మలన్ (53), బట్లర్ (40) జట్టును ఆదుకున్నారు. కానీ, ఈ ఇద్దరు ఒకే ఓవర్లో ఔట్ అయ్యేసరికి ఇంగ్లండ్ పట్టు కోల్పోయింది. 3 ఓవర్లలో 36 పరుగులు చేయాల్సిన టైంలో బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దాంతో చివరి 3 ఓవర్లలో ఇంగ్లంగ్ 19 పరుగులే చేయగలిగింది. ఒక పెద్ద జట్టును టీ20ల్లో వైట్ వాష్ చేయడం ఇదే తొలిసారి.

Leave a Reply

%d