హైదరాబాద్ మరోమారు స్పా సెంటర్లపై దాడులు నిర్వహించారు పోలీసులు. క్రాస్ మాసాజ్ పేరులతో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఈ దాడులు నిర్వహించినట్లు పోలీసులు వెల్లడించారు. బంజరాహిల్స్ లోని హెవన్ ఫ్యామిలీ, హవురాన్, కదార్ వా హమామ్ లపై దాడులు చేసి సీజ్ చేశారు. స్పా పేరుతో విటులను ఆకర్షించి మసాజ్ పేరుతో వ్యభిచారం చేయిస్తున్నారని ఆరోపణలు వచ్చాయన్నారు. గతంలో కూడా అనేక సార్లు దాడులు చేసి అరెస్ట్ జరిగినా… స్పా నిర్వహకుల్లో మార్పు రావడం లేదన్నారు. ఇక ఇలాంటి ఘటనలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
హెవన్ ఫ్యామిలీ, అరుణ్ స్పాలో వ్యభిచారం
