నన్ను మోసం చేశారు – భూమిక

అందరు హీరోయిన్లతో పాటు తను కూడ ఓ విషయంలో మోసం మోసపోయానని అన్నారు స్టార్ హీరోయిన్ భూమిక. కొందరికి క్యాస్టింగ్ కౌచ్ రూపంలో వేధింపులు ఎదురవుతుంటాయి. మరి కొందరికి అవకాశాల పరంగా, ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ప్రముఖ నటి భూమికా చావ్లా కూడా తాను మోసపోయినట్టు తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. ‘తేరే నామ్’ చిత్రంతో తాను హిందీలో తొలి చిత్రం చేశానని… ఆ సినిమా విజయం సాధించడంతో తనకు మంచి అవకాశాలు రావడం మొదలయ్యాయని చెప్పింది.

For More News clink the link: https://eenadunews.co.in/

‘తేరే నామ్’ తర్వాత తనకు ఒక పెద్ద ఆఫర్ వచ్చిందని… అయితే నిర్మాతలు మారిపోవడంతో హీరోతో పాటు తనను కూడా ఆ సినిమా నుంచి తీసేశారని భూమిక తెలిపింది. ఆ సినిమా టైటిల్ ను కూడా మార్చేశారని చెప్పింది. ఆ సినిమాను చేసి ఉంటే ఇప్పుడు తన పరిస్థితి మరోలా ఉండేదని తెలిపింది. ఆ సినిమా గురించి తాను ఏదేదో ఊహించుకున్నానని… మరో సినిమాను ఒప్పుకోకుండా ఏడాది వేచి చూశానని చెప్పింది. అంతేకాదు ‘జబ్ వీ మెట్’ సినిమాకు కూడా తొలుత తానే సంతకం చేశానని… తనకు జోడీగా బాబీ డియోల్ ను తీసుకున్నారని… అయితే, బాబీ డియోల్ ను తీసేసి షాహిద్ కపూర్ ను తీసుకున్నారని… ఆ తర్వాత తనను కూడా తీసేశారని… చివరకు ఆ చిత్రంలో షాహిద్ కపూర్, కరీనా కపూర్ నటించారని ఆవేదన వ్యక్తం చేసింది.

Leave a Reply

%d