బీహార్ రాష్ట్రంలోని బాగల్ పూర్. ఆమె పేరు కరిష్మా. అతని పేరుకి రోహిత్ కుమార్. అదే పోలీస్ స్టేషన్ పరిధిలోని బాతోడియా గ్రామానికి చెందిన వీరిద్దకి పరిచయం ఏర్పడగా.. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అందరి జీవితాల్లో ఇక్కడివరకు కామన్ గానే జరుగుతుంది. అయితే ఇక్కడి నుంచే అసలు కథ స్టార్ట్ అయింది. వీరిద్దరూ రెండేళ్లుగా ప్రేమాయణం సాగించారు. ఇక యువతీ తనని పెళ్లి చేసుకోవాలని బలవంతం పెట్టడంతో ఆమె నుదిటిన సింధూరం పెట్టి ఆ మహిళని తన ఇంటికి తీసుకెళ్లాడు. అయితే వీరి ప్రేమ పెళ్లిని అబ్బాయిల ఇంట్లో ఒప్పుకోలేదు. దీంతో అమ్మాయిని ఇంట్లో నుంచి తరిమేశారు.
For More News Click: https://eenadunews.co.in/
ఇదే విషయమై ఆ యువతీ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఆ అబ్బాయి మీద అత్యాచార కేసుని నమోదు చేసింది. దీంతో జైలుకి వెళ్లిన ఆ యువకుడు ఇటీవలే బెయిల్ మీద రిలీజయ్యాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఆ యువతీ నేరుగా అతను పని చేస్తున్న ఆఫీస్ దగ్గరకి వెళ్ళింది. అతని కాలర్ పట్టుకొని నన్ను పెళ్లి చేసుకుంటావా? లేదా అని ఆ దగ్గర్లో ఉన్న గుడి దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. తనకు పెళ్లి చేసుకోకపోతే విషం తాగి చనిపోతానని చెప్పుకొచ్చింది. దీంతో ఇదంతా చూసిన ఆఫీస్ సిబ్బంది దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వగా.. వీరిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడి నుండి పంపించేశారు. తదుపరి విచారణ కోసం వీరి తల్లి దండ్రులతో హాజరవ్వాల్సిందిగా పోలీసులు తెలిపారు. మరి ఒక యువతీ ఇలా ధైర్యంగా తన లవర్ కి ఝలక్ ఇవ్వడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.