కౌశిక్ రెడ్డిని బొందపెట్టాలి – జయశ్రీ

తెలంగాణ గవర్నర్ తమిళసై పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన భారస నేత కౌశిక్ రెడ్డిని బొంద పెట్టాలని ఘటైన విమర్శలు చేశారు కరీంనర్ జిల్లా భారతీయ జనతా పార్టీ మహిళా అధ్యక్షురాలు, బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ.

పాడి కౌశిక్ మాట్లాడిన విధానం చూస్తుంటే పిచ్చోని చేతికి రాయి ఇచ్చినట్లు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు కనకపు సింహాసనం మీద శునకమను పెట్టినట్టు ఉన్నది మనిషి మారడు గుణం తీరు మారదు అని అన్నారు శనివారం తెలంగాణ చౌక్ లో రాష్ట్ర గవర్నర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ సందర్భంగా బిజెపి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు చొప్పర్ జయశ్రీ మాట్లాడుతు : పాడి కౌశిక్ మాట్లాడిన విధానం చూస్తుంటే .. వినాశనానికే విపరీత బుద్ధితో మితిమీరి మాట్లాడుతున్నాడని, ఆయనకు పదవి కట్టబెట్టిన వ్యక్తి తీరు ఎట్లుంటే కింది స్థాయి నాయకుల తీరు అలాగే ఉంటుంది అన్నారు.
రాష్ట్ర ప్రథమ పౌరురాలు గవర్నర్ పై అనుచిత వ్యాఖ్యలను మహిళ మోర్చ పక్షాన ఖండిస్తున్నాం అన్నారు. చరిత్రలో మహిళలతో పెట్టుకున్న వాడు ఎవడు బాగుపడలేదని బి అర్ ఎస్ నాయకుల ప్రవర్తనతీరు, మహిళ పట్ల యావత్ రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారన్నారు.ఇలాంటి సందర్భాల్లో రాష్ట్రాన్ని కాదు దేశాన్ని చక్క బెడుతమని అనడం సిగ్గుచేటు అన్నారు. ముఖ్య మంత్రి. మహిళల పట్ల అనుచితంగా మాట్లాడిన తీరు చాలా సందర్భాలు ఉన్నాయి.యధా రాజ ప్రజా తద అన్నట్లు ఉంది. అన్నారు.ఇట్లాంటి నాయకులను పట్టుకొని ముందుకు పోతుంటే కుక్కను పట్టుకొని గోదారి ఇదినట్లు ఉంది అని. ఇట్లాంటి వాటిని ఖండించకపోతే మీ స్వయంకృత అపరాధం మీకు మీరే బొంద పెట్టు కోవడం ఖాయమన్నారు. ఆయనను కాదు ఆయనకు పదవి కట్టబెట్టిన వ్యక్తి కె సంస్కారం లేదు, కౌశిక్ రెడ్డి వెంటనే గవర్నర్కు రాష్ట్ర మహిళలకు క్షమాపణ చెప్పకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు, కౌశిక్ రెడ్డి ని వెంటనే పదవి నుంచి భర్త రఫ్ చేయాలని మహిళా మోర్చా తరఫున డిమాండ్ చేశారు… ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యురాలు బోడిగ శోభ మాట్లాడుతూ తెలంగాణ వద్దు అన్నొన్ని తీసుకొచ్చి అందలమెక్కించి మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన ఏమి పట్టనట్టు కేసీఆర్ కేటీఆర్ ముఖ్యంగా కవిత చూస్తున్నారని వీళ్ళ అండ చూసుకొని కౌశిక్ రెడ్డి పీట్రేగిపోతున్నాడని ఇప్పటికైనా కౌశిక్ రెడ్డి కాళ్ళ మీద మోకరిల్లి యావత్ మహిళా సమాజానికి క్షమాపణ చెప్తే కానీ రోడ్లమీద తిరిగే పరిస్థితి ఉండదు,లేనిచో చెప్పు చిపురులతో కొడతామని బొడిగె శోభ అన్నారు ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శులు దేశ శిల్ప గొట్టిముక్కుల ఉమారాణి, రాష్ట్ర బాధ్యులు వరాల జ్యోతి రమాదేవి ఉపాధ్యక్షురాలు చైతన్య కార్యదర్శులు ప్రేమలత చంద్రకళ మండల అధ్యక్షులు అరుణ, సుధా వైష్ణవి, సునీత రెడ్డి బాలమ్మ, సోనీ మొదలగు వారు పాల్గొన్నారు

Leave a Reply

%d bloggers like this: