తుల ఉమ కోసం ఈటల చేసిన పని

భారతీయ జనతా పార్టీలో ఈటల హవా కొనసాగుతోంది. ఇప్పటికే చేరికల మీద ఫోకస్ పెట్టిన అతను తనను నమ్ముకున్నవారికి సాయం చేస్తున్నారు. ఎంపీగా ఉన్న బండి సంజ‌య్ ఈసారి క‌రీంన‌గ‌ర్ అసెంబ్లీ నుండి కాకుండా టెంపుల్ టౌన్ వేముల‌వాడ (Vemulawada) నుండి పోటీ చేసేందుకు ఆస‌క్తి చూపించారు. అక్క‌డ త‌న వ‌ర్గాన్ని ఎంక‌రేజ్ చేయ‌టంతో పాటు ఎంపీగా రెగ్యూల‌ర్‌గా ప‌ర్య‌టించారు. స్టేట్ ప్రెసిడెంట్‌గా కూడా ఉన్నారు కాబ‌ట్టి ఆయ‌న‌కు ఆ సీటు ప‌క్కా అని, ఇప్ప‌టికే రెండుసార్లు క‌రీంన‌గ‌ర్ నుండి ఓడిపోయారు కాబ‌ట్టి మ‌ళ్లీ అక్క‌డ‌కు ఆయ‌న వెళ్ల‌ర‌ని అంతా ఫిక్స్ అయిపోయారు.

కానీ, ఈటెల‌తోపాటు పార్టీలోకి వ‌చ్చిన తెలంగాణ ఉద్య‌మ లీడ‌ర్, మాజీ జెడ్పీ చైర్మ‌న్ తుల ఉమ (Tula Uma) వేముల‌వాడ (Vemulawada) సీటు కోసం ముందు నుండి ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈటెల కూడా త‌న‌కు సీటుపై హామీ ఇచ్చే పార్టీలోకి తీసుకున్నార‌న్న‌ది ఓపెన్ సీక్రెట్. కానీ తీరా బండి సంజ‌య్ ఫోక‌స్ చేయ‌టంతో వేముల‌వాడ సీటు విష‌యంలో బండి వ‌ర్సెస్ ఈటెలగా (Bandi Sanjay Vs Etela Rajender) సీన్ మారిపోయింది. పైగా సీట్ల‌పై వ్య‌క్తిగ‌తంగా ఎవ‌రేం చెప్పినా పార్టీ నిర్ణ‌య‌మే ఫైన‌ల్ అంటూ ఈటెల విష‌యంలో బండి సంజ‌య్ గ‌తంలో ఘాటుగానే స్పందించారు. నాటి నుండి ఆ పంచాయితీ అలా కంటిన్యూ అవుతూనే ఉంది.

కాగా, అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై ఫోక‌స్ చేసిన బీజేపీ.. ఇబ్బంది లేని సీట్ల విష‌యంలో నేత‌ల‌కు క్లారిటీ ఇస్తోంది. పోటీకి రెడీ చేసే ప‌నిలో ప‌డింది. అందులో భాగంగా బండి సంజ‌య్ విష‌యంలోనూ స్ప‌ష్ట‌త ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. క‌రీంన‌గ‌ర్ నుండే పోటీ చేయాల‌ని, మంత్రి గంగుల‌ కమలాకర్‌ను (Gangula Kamalakar) ఓడించాల్సిందేన‌ని పార్టీ ఆదేశించిన‌ట్లు స‌మాచారం. దీంతో క‌రీంన‌గ‌ర్ విష‌యంలో స్వ‌త‌హాగా స‌ర్వే కూడా చేయించుకున్న బండి… పోటీకి మొగ్గుచూపుతున్నార‌ని, అందుకే ఇక నుండి వారంలో ఒక రోజు కరీంన‌గ‌ర్ అసెంబ్లీకే త‌న స‌మ‌యం కేటాయిస్తాన‌ని ప్ర‌క‌టించార‌ని బీజేపీ వ‌ర్గాలు అంటున్నాయి.

ఇటీవ‌ల ఈటెల రెగ్యూల‌ర్‌గా ఢిల్లీ పెద్ద‌ల‌తో ట‌చ్‌లో ఉంటున్నారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లు కూడా చేస్తుండ‌టంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ప‌ర్య‌టిస్తున్నారు. ఈటెల ఢిల్లీలో చ‌క్రం తిప్ప‌టంతోనే బండి సంజ‌య్‌కు చెక్ ప‌డింద‌ని, తుల ఉమ‌కు ఈటెల రాజేంద‌ర్ ద‌గ్గ‌రుండి వేముల‌వాడ సీటు ప‌క్కా చేయించార‌న్న ప్ర‌చారం బీజేపీ వ‌ర్గాల్లో జ‌రుగుతోంది. ఇక ఎల్లారెడ్డి నుండి ఈటెల అనుచ‌రుడు ఏనుగు ర‌వీంద‌ర్ రెడ్డికి సీటు ఖాయం కాగా… మ‌రికొన్ని చోట్ల త‌న వ‌ర్గానికి టికెట్లు ఇప్పించుకునే ప‌నిలో ఈటెల ఉన్నార‌ని, అలా సీట్లు ఇస్తే బీఆర్ఎస్ (BRS) నుండి సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా బీజేపీ గూటికి తెచ్చే బాధ్య‌త త‌న‌దని ఈటెల అధిష్టానానికి మాటిచ్చిన‌ట్లు బీజేపీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌స్తుతానికి స్టేట్ బీజేపీలో ప‌వ‌ర్ సెంట‌ర్‌గా ఉన్న బండి సంజ‌య్ సొంత స్థానానికే ఈటెల ఎసరుపెట్టారుగా… అంటూ ఇంట‌ర్న‌ల్ పాలిటిక్స్‌పై చ‌ర్చ‌లు సాగుతోన్నాయి.

Leave a Reply

%d