ఎంపీ సోయి లేకుండా మాట్లాడుతున్నాడు

దళిత మహిళా సర్పంచ్ ను మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి అవమానించడం శోచనియమని దానికి నిరసనగా నియోజకవర్గ కేంద్రమైన దుబ్బాకలోని స్థానిక బస్టాండ్ వద్ద గురువారం ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగావారు మాట్లాడుతూ…దుబ్బాక నియోజకవర్గం లోని మిరిదొడ్డి మండలం చెప్యాల గ్రామ సర్పంచ్ అయినా దళిత మహిళ మాచపురం లక్ష్మికి గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపనకు వచ్చిన మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి సమాచారం ఇవ్వకపోవడం ఉల్లంగించినట్టేనని అన్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తన నిరంకుశ వైఖరి మార్చుకోవాలని అన్నారు. ఎనిమిది సంవత్సరాలు దుబ్బాక నియోజకవర్గానికి గాలికి వదిలేసి ప్రస్తుతం సవతి తల్లి ప్రేమ చూపడం సరైంది కాదని అన్నారు. దుబ్బాక నియోజకవర్గం కి సిడిఎఫ్ తెచ్చి తన సొంత నిధులుగా ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు అన్నారు. దళిత సర్పంచ్ ను అవమానపరిచిన ఎంపీ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మట్ట మల్లారెడ్డి,సుంకు ప్రవీణ్, పుట్ట వంశి, దూల వెంకట్ గౌడ్, మచ్చ శ్రీనివాస్, గాజుల భాస్కర్, రమణారెడ్డి, నిహాల్ గౌడ్, బాచి, రమేష్ రెడ్డి, అంజి తోపాటు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

%d bloggers like this: