కాళేశ్వరం అప్పు ఎలా తీరింది – మాధవి

కాళేశ్వరం అప్పు పూర్తిగా తీరిపోయిందని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకురాలు కొల్లి మాధవి. 80 వేల కోట్ల అప్పు మొత్తం ఎలా తీరిందో… కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి ఎంతో ఖర్చు అయిందో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

కాగ్ నివేదిక మేరకు కాళేశ్వరం డిపిఆర్ ప్రకారం 81,911.01 నిర్మాణ వ్యయంగా ఉంది. కాగ్ ప్రస్తుత అంచనా లెక్కల మేరకు 1లక్ష 49,317.22 కోట్లుగా ఉంది. తాజా నిర్మాణ వ్యయ లెక్కల మేరకు ప్రతి ఏకరాకు ఐదు లక్షల క్యాపిటల్ కాస్ట్ గా ఉంది. విద్యుత్ చార్జీలకు 10,374 కోట్లు అవసరం. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అదనం. వాటన్నింటినీ పరిగణలోకి తీసుకొని కాగ్ ఎకరాకు నిర్వహణ ఖర్చు 46,364 గా తేల్చింది. 1 రూపాయి ఖర్చుకు 52 పైసల ప్రయోజనమే అవుతుందని పేర్కొంది. ఇప్పుడు ప్రాజెక్టు నిర్మాణ, నిర్వహణ, లాభాల లెక్కలు పక్కన పెడితే సీఎం కేసీఆర్ తాజాగా చెప్పినట్లుగా కాళేశ్వరం ప్రాజెక్టు అప్పు ఎప్పుడు తీరిపోయిందోనన్న ప్రశ్నకు మళ్లీ కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు.

Leave a Reply

%d