సనాతన ధర్మంపై జరుగుతున్న దాడులు కేసీఆర్ మౌనం ఎందుకు: మాధవి

తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ రాష్ట్ర నాయకురాలు కొల్లి మాధవి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆమె సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తారు. అందరికంటే తానే పెద్ద హిందువునని కేసీఆర్ చెప్పుకుంటాడని, కానీ సనాతన ధర్మంపై జరుగుతున్న దాడులు కేసీఆర్ కు కనిపించడంలేదా అని ప్రశ్నించారు. ఉదయనిధి వ్యాఖ్యలపై ఎందుకు మాట్లాడడంలేదని నిలదీశారు.  భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచ దేశాలు కీర్తిస్తుంటే, కొందరు సనాతన ధర్మంపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. సనాతన ధర్మంపై దాడులు చేసే వారికి ఓటుతోనే సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ లకు ప్రజలు బుద్ధి చెప్పాలని అన్నారు.

 

 

Leave a Reply

%d bloggers like this: