తమ పార్టీని తిట్టడమే కోసమే కేసీఆర్ ఆవిర్భావ సభ పెట్టారని విమర్శించారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాధవి. తెలంగాణలో బీజేపీకి వస్తున్న ఆధారణ చూడలేకపోతున్నారని మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తున్నా…. తెలంగాణకు ఏమాత్రం న్యాయం జరగడం లేదని అనడం శోచనీయమని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని పథకాలు విజయవంతంగా నడుస్తున్నాయని డబ్బా కొట్టుకోవడం తప్పా ఇంకేలేదన్నారు. రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నా… జరగడం లేదని అబద్దాలు మాట్లాడుతున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్డడానికి కోట్లలో అవినీతి జరిగిందని బట్టబయలవుతున్న తరుణంలో ఆ విషయాన్ని పక్కదోవ పట్టించడానికి భారసతో కొత్తనాటాకానికి తెర లేపారని వ్యాఖ్యానించారు. మంచినీళ్ల కోసం పార్టీ పెట్టరని అనడం సిగ్గుచేటరన్నారు. దేశంలో ప్రతి గ్రామంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో జలశక్తి పేరుతో మంచినీరు తాగుతున్నారని తెలిపారు.
బీజేపీని తిట్టడానికే కేసీఆర్ సభ – కొల్లి మాధవి
