కేసీఆర్ రావడం వెనకున్నఆంతర్యమదే – మాధవి

శీతాకాలం విడిది కోసం తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్ రావడం వెనకాల మరోకోణం దాగుందంటున్నారు రాజకీయ నాయకులు. స్వయాన దేశ ప్రధాని వచ్చినప్పుడు తప్పించుకొని తిరిగిన సీఎం ఇప్పుడు రాష్ట్రపతి కోసం రావడం ఏంటా అని ప్రశ్నించుకుంటున్నారు. అయితే అతని రాక వెనుకాల బలమైన కారణం ఉందని అన్నారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకురాలు కొల్లి మాధవి. భారస పేరుతో దేశ వ్యాప్తంగా రాజకీయం చేయాలనుకుంటున్న కేేసీఆర్ కి ఆశించిన స్ధాయిలో స్పందన కరువైంది. ఇందుకు కారణం ఒంటెద్దు పోకడకలు పోవడం కారణమని అర్ధమైందన్నారు. రాజకీయం కోసం సీఎం స్వాగతించడానికి వచ్చారని విమర్శించారు.

ఎన్ని ఎత్తుగడలు వేసిన దేశంలో కేసీఆర్ ని నమ్మరని అన్నారు. అమ్మకు అన్నం పెట్టని వాడు పిన్నమ్మ బంగారు గాజులు చేయిస్తానని అన్నాడట వెనకటి ఒకడు ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి కూడా అలానే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతాలు ఆకలి చావులు చస్తుంటే… పట్టించుకోని సీఎం ఇతర రాష్ట్రాల ప్రజలకు సేవ ఎలా చేస్తారని ప్రశ్నించారు. లిక్కర్ స్కాంలో తన బిడ్డ కవితను కాపాడుకోడం కోసమే రాజకీయపరమైన ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

Leave a Reply

%d