ఖమ్మం జైలుకు బండి సంజయ్ తెలంగాణలో ప్రకంపనలు

తెలంగాణలో ఇప్పుడంతా పేపర్ లీకుల వ్యవహారం నడుస్తోంది. ఇటీవల టీఎస్పీఎస్ పేపర్ల లీకుల అంశం మరవక ముందే పదో తరగతి పేపర్లు లీకు కావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనికి ప్రధాన సూత్రదారి భాజపా రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్ అని వరంగల్ సీపీ రంనాథ్ అన్నారు. ఈ మేరకు ఆయన్ని గత రెండు రోజుల క్రింత అర్థరాత్రి అరెస్ట్ చేసి, నిన్న జడ్జి ముందు విచారించారు.

పేపర్ లీక్ అంత కూడా బండి సంజయ్ డైరెక్షన్లో జరిగినట్లు ..బండి సంజయ్ – ప్రశాంత్ ల మధ్య జరిగిన వాట్సాప్ చాట్ ను మీడియా ముందు బయటపెట్టారు. రిమాండ్ రిపోర్టులో ఎ1 గా బండి సంజయ్ ని చేర్చారు. ఎ2 గా ప్రశాంత్, ఎ3 మహేష్, ఎ4 శివగణేష్ గా పోలీసులు రిమాండ్ రిపోర్టులో చూపించారు.

ఇక హిందీ పేపర్ లీక్ ఘటన కు సంబంధించి పూర్తి వివరాలు సీపీ రంగనాధ్ మీడియా కు తెలిపారు. నిన్నటి వరకు దీంట్లో బండి సంజయ్ హస్తం ఉన్నట్టు భావించిన పోలీసులు… ఆయనను అర్ధరాత్రి పూట అరెస్ట్ చేశారు. కాగా.. పూర్తి ఆధారాలు సేకరించిన అనంతరం ఈ మొత్తం కేసులో ఏ1గా బండి సంజయ్‌ పేరును చేర్చినట్లు తెలిపారు. అయితే.. ఇందులో ప్రశాంత్ అనే వ్యక్తి.. ప్రశ్నా పత్రాన్ని బండి సంజయ్‌కు 11:24కు ఫార్వర్డ్ చేశారని తెలిపారు. కాగా.. కేవలం ప్రశ్నా పత్రాన్ని షేర్ చేసినందుకు మాత్రమే అరెస్ట్ చేయలేదని.. అందుకు బలమైన కారణాలున్నాయని తెలిపారు. ఇందులో.. ప్రశాంత్, బండి సంజయ్ మధ్య జరిగిన సంభాషణ చాలా కీలకంగా మారిందని తెలిపారు. పేపర్ లీక్ కంటే ముందు రోజునే ప్రశాంత్, బండి సంజయ్ మధ్య వాట్సప్ చాట్ జరిగిందని వివరించారు. ఆ చాట్ ఆధారంగానే బండి సంజయ్‌ని ఏ1గా చేర్చామని స్పష్టతనిచ్చారు.

బండి సంజయ్‌ను అరెస్ట్ చేసిన సమయంలో.. మొబైల్ అడిగితే లేదని చెప్పారు. ఫోన్ ఇస్తే.. కీలక ఆధారాలు బయటపడతాయని ఆయనకు కూడా తెలుసు.. అందుకే ఆయన మొబైల్ ఇవ్వకుండా దాచారు. ఆయన ఫోన్ దొరికితే.. చాలా కీలకమైన ఆధారాలు బయటకు వచ్చేవి. బండి సంజయ్ ఫోన్‌లో పేపర్ లీక్ సంబంధించి మరింత సమాచారం ఉంటుంది.” అని సీపీ రంగనాథ్ తెలిపారు.

తెలుగు ప్ర‌శ్న‌ప‌త్రం బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రుణంలో.. దీన్ని అవ‌కాశంగా మ‌లుచుని ప్ర‌భుత్వాన్ని బద్నాం చేయాల‌నే ఉద్దేశంతో బండి సంజ‌య్, ప్ర‌శాంత్ కుట్ర చేశార‌ని తెలిపారు. కార్పొరేట్ స్కూళ్ల‌తో ప్ర‌భుత్వం కుమ్మ‌కై పేప‌ర్ల‌ను లీక్ చేస్తుంది. ఐటీ మంత్రి కేటీఆరే ఇందుకు కార‌ణం అని బండి సంజ‌య్, ప్ర‌శాంత్ మ‌ధ్య వాట్సాప్ చాటింగ్స్ న‌డిచాయి. ఇవే చాటింగ్స్ మ‌రుస‌టి రోజు ప్ర‌ధాన ప‌త్రిక‌ల్లో వ‌చ్చాయ‌ని తెలిపారు. హిందీ ప్ర‌శ్న‌ప‌త్రం లీకైన త‌ర్వాత ప్ర‌శాంత్ పంపించిన సందేశాన్నే బండి సంజ‌య్ ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. అవ‌న్నీ త‌మ వ‌ద్ద ఆధారాలు ఉన్నాయ‌న్నారు.

Leave a Reply

%d bloggers like this: