మసీదులో బాంబు పేలుడు.. 21మంది మృతి

పాకిస్థాన్  పెషవర్‌లోని ఓ మసీదులో సోమవారం భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 21మంది మృతిచెందగా.. సుమారు 95మందికి పైగా గాయపడినట్టు తెలుస్తోంది. పెషావర్‌లోని పోలీస్‌ లైన్స్‌ ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం మసీదులో ప్రార్థనల సమయంలో ఈ పేలుడు సంభవించినట్టు పోలీసులు వెల్లడించారు. అనేక మంది క్షతగాత్రులు తమ ఆస్పత్రిలో చేరినట్లు పెషావర్‌లోని లేడీ రీడింగ్‌ ఆస్పత్రి అధికార ప్రతినిధి మహమ్మద్‌ అసీం వెల్లడించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపారు. ఈ పేలుడు ధాటికి భవనంలో కొంత భాగం కుప్పకూలిపోగా ఆ శిథిలాల కింద కొందరు చిక్కుకున్నట్టు సమాచారం.

Leave a Reply

%d bloggers like this: