ఆశలన్ని బౌలర్ల మీదే

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్‌ ఓటమి దిశగా పయనిస్తోంది. అంతేకాదు.. ఈ మ్యాచ్‌ కూడా మిగిలిన రెండు టెస్టుల మాదిరే మూడు రోజుల్లోపే ముగియబోతోంది. స్పిన్నర్లు పండగ చేసుకుంటున్న హోల్కర్‌ ట్రాక్‌పై ఆస్ట్రేలియా విజయం కోసం సాధించాల్సింది.. 76 పరుగులే. ఈ క్రమంలో బ్యాట్‌కు, బంతికి మధ్య పోరాటం ఆసక్తి రేపనుంది. స్పిన్నర్‌ నాథన్‌ లియోన్‌ (8/64) ధాటికి భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 163 పరుగులకు కుప్పకూలింది. చటేశ్వర్‌ పుజార (59) అర్ధసెంచరీతో పోరాడగా, శ్రేయాస్‌ అయ్యర్‌ (26) ఉన్న కాసేపు ఎదురుదాడికి దిగాడు. స్టార్క్‌, కునేమన్‌లకు ఒక్కో వికెట్‌ దక్కింది. అంతకుముందు ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులు చేయడంతో భారత్‌పై 88 పరుగుల ఆధిక్యం లభించింది. హ్యాండ్స్‌కోంబ్‌ (19) గ్రీన్‌ (21) మాత్రమే రాణించారు. జడేజాకు నాలుగు, అశ్విన్‌.. ఉమేశ్‌లకు మూడేసి వికెట్లు దక్కాయి.

 

Leave a Reply

%d