నన్ను చంపేందుకు బీఆర్‌ నాయుడు ప్లాన్‌ చేస్తున్నాడు: పోసాని

ఏపీఎఫ్‌డీసీ ఛైర్మన్‌ పోసాని కృష్ణమురళి కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియా ముసుగులో బీఆర్‌నాయుడు బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు.  చంపించడం అనేది బీఆర్‌ నాయుడికి చాలా చిన్న పని అని అన్నారు. కాగా, పోసాని కృష్ణమురళి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీపై కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ప్రశ్నిస్తే అంతు చూస్తామని నన్ను బెదిరించారు. బీఆర్‌ నాయుడికి దివంగత నేత వైఎస్సార్‌ భిక్ష పెట్టారు. మీడియా ముసుగులో బీఆర్‌ నాయుడు బెదిరింపులకు దిగుతున్నారు. ఆడవాళ్లపై టీవీ-5లో నీచాతినీచంగా మాట్లాడుతున్నారు. మీ ఇళ్లలో ఆడవాళ్లు లేరా? వారితో ఇలానే మాట్లాడుతారా?. ఇప్పటికైనా బీఆర్‌ నాయుడు మహిళలకు క్షమాపణ చెప్పాలి ఆయన అన్నారు.

Leave a Reply

%d bloggers like this: