వెక్కి వెక్కి ఏడ్చిన రాజన్న

లైంగిక ఆరోపణలతో వార్తల్లో నిలిచిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య..వెక్కివెక్కి ఏడ్చారు. స్టేషన్ ఘనపూర్‌ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, తనపై వస్తున్న లైంగిక ఆరోపణల నేపథ్యంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కరుణాపురంలో బుధవారం జరిగిన ఓ చర్చి ఫాదర్ పుట్టిన రోజు వేడుకలకు రాజయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసేటప్పుడు రాజయ్య భావోద్వేగానికి లోనయ్యారు. కేకు ముందు కూర్చుని వెక్కివెక్కి ఏడ్చేశారు. తనపై లైంగిక ఆరోపణలు రావడంతో తీవ్రంగా కలత చెందానని చెప్పుకొచ్చారు. తనను రాజకీయంగా ఎదురుకునే దమ్ములేకనే కొందరు దిగజారి రాజకీయాలు చేస్తున్నారన్నారు. దమ్ముంటే తనపై పోటీచేసి గెలవాలని సవాల్ విసిరారు. తనకు కూతురుతో సమాన వయసున్న మహిళలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారన్నారు. తానేమీ తప్పు చేయలేదన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా స్టేషన్ ఘనపూర్‌లో 5వ సారి భారీ మెజారిటీతో గెలిచి తీరుతానని రాజయ్య తెలిపారు. స్టేషన్ ఘన్ పూర్ లో తనపై జరుగుతున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. తన ప్రత్యర్థులు చేస్తున్న కుట్రలను, దిగజారుడు రాజకీయాలను గమనించి వచ్చే ఎన్నికల్లో వారికి బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే రాజయ్య నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు.

Leave a Reply

%d bloggers like this: