డోర్నకల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ వివాదాల్లో చిక్కుకున్నారు. మిషన్ భగీరథ నీళ్లు తమ ఇంటికి రాలేదని ఎవరైనా తనకు ఫిర్యాదు చేస్తే… దానికి బాధ్యులైన అధికారిని మహిళలతో తన్నిస్తానని హెచ్చరించారు. డోర్నకల్ నియోజకవర్గం నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రెడ్యా నాయక్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. వివాదాలకు దూరంగా ఉండే రెడ్యా..ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది.
ఈ నెల 28 నాటికి లోటుపాట్లను సరిదిద్దుకోవాలని తెలిపారు. వచ్చే ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని, ఆ తర్వాత పోటీ చేయబోనని, ఇంకొక్కసారి తనను గెలిపించాలని ప్రజలను కోరుతూ గత వారం రోజులుగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అయితే వెళ్లిన చాలాచోట్ల ప్రజల నుంచి నిరసనలు ఎదురువుతున్నాయి. గెలిచినా ఇన్ని ఏళ్లకు మళ్లీ మీము గుర్తు వచ్చామా..? అని ఎక్కడిక్కడే నిలదీస్తున్నారు. అసలు ఆ ఊరికి ఏంచేశారు..? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇలా ప్రజల నుండి నిరసనలు ఎదురువుతుండడంతో ఎమ్మెల్యే రెడ్యానాయక్ పోలీస్ బందోబస్తు పెట్టుకుని మరీ ప్రచారం నిర్వహిస్తున్నారు.