తెలంగాణ రాష్ట్ర సమితి నుండి భారత రాష్ట్ర సమితిగా రూపుదిద్దుకున్న తరువాత అధినేత పార్టీ విస్తరణపై నిమ్మగ్నమైనారు. ఈ మేరకు పొరుగు రాష్ట్రమైన ఏపీలో ముందుగా విస్తరణ కార్యక్రమాలు జోరందుకున్నాయి. ఇప్పటికే వివిధ పార్టీలో ఉండి ఇమడలేక పోతున్న వారిపై గురి పెట్టారు. ఇందులో భాగంగా జనసేన నుండి పోటీ చేసి ఓడిపోయిన మాజీ ప్రభుత్వ అధికారి తోట చంద్రశేఖర్ త్వరలో పార్టీలో చేరబోతున్నట్లు సమచారం. వైకుంఠ ఏకదశి రోజున పార్టీలో చేరి ఏపీ రాష్ట్ర బాధ్యతలు భూజన వేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రేపు తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.
ఏపీలో భారస విస్తరణ, అధ్యక్షుడు అతనేనా ?
