భారత రాష్ట్ర సమితికి ఆదిలో దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నాయి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గట్టి ఎదురు దెబ్బే తగిలిందని చెప్పుకోవాలి. వాంకిడి మండలానికి చెందిన 18 మంది ఆదివాసీ సర్పంచ్ లు మూకుమ్మడి రాజీనామాకు పూనుకున్నారు. ఎమ్మెల్యే ఆత్రం సక్కు తమను పట్టించుకోవడం ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నిధుల లేమితోనే రాజీనామా చేస్తున్నట్టు వారు తెలిపారు. రాజీనామా పత్రాలను మండలాధ్యక్షునికి పంపించినట్టు వారు తెలిపారు. ఆదివాసీ గ్రామాల సమస్యల కోసం చెపుదామని వెళితే..సమయం కేటాయించడం లేదని సర్పంచ్ లు తెలిపారు. రాజీనామా పత్రాలపై 18 మంది సంతకాలు చేసి మండల అధ్యక్షునికి ఇచ్చినట్టు తెలిపారు. కాగా 18 సర్పంచ్ ల మూకుమ్మడి రాజీనామా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయింది. గతంలో మా గ్రామాల అభివృద్ధి కోసం మా ఎమ్మెల్యేను ఎన్నో సార్లు కలిసి విన్నవించాం. అయినా కానీ ఏ ఒక్క సమస్యను కూడా ఇప్పటివరకు పరిష్కరించలేదు. ఇప్పుడు ఎమ్మెల్యే ఆత్రం సక్కు దగ్గరకు వెళ్తే కనీసం కూర్చొని మాట్లాడే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు కూడా మా గ్రామాలకు ఒక్కసారి ఎమ్మెల్యే రాలేదు. ఏ ఒక్క అభివృద్ధి పని చేపట్టలేదు. ఎమ్మెల్యే వైఖరి నచ్చకనే తామంతా రాజీనామా చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యేను ఎన్నోసారు కలిసిన ఫలితం లేకపోయింది. రాజీనామాతోనైనా ఎమ్మెల్యే స్పందిస్తారో లేదా అనేది చూడాలన్నారు. జిల్లాలో ఒకేసారి 18 మంది ఆదివాసీ ఎమ్మెల్యేల రాజీనామా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. గ్రామంలో అభివృద్ధి జరగడం లేదని చెబుతూనే స్థానిక ఎమ్మెల్యేపై వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఓ వైపు నిధులు లేకపోవడం మరోవైపు ఎమ్మెల్యే సహకారం అందించకపోవడంతో చేసేదేమి లేక ఎమ్మెల్యేలు మూకుమ్మడి రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. కాగా రాష్ట్రంలో కొన్ని గ్రామాల సర్పంచ్ లు నిధుల లేమితో నానా తంటాలు పడుతున్నారు. నిధుల లేమితో గ్రామాభివృద్ధి కోసం అప్పులు చేయాల్సి వస్తుందని వాపోతున్నారు. అయితే దీనిపై పలుమార్లు నిరసన కూడా తెలిపారు. బిల్లులు రావడం లేదని, ఉన్న నిధులు రావడం లేదని సర్పంచ్ లు కూలి పని కూడా చేసుకున్న సంధర్బాలున్నాయి. కొత్త నిధులు రాకపోవడం, పెండింగ్ బిల్లులు క్లియర్ కాకపోవడంతో సర్పంచ్ లా బాధ వర్ణనాతీతంగా మారింది. జిల్లాలో ఇప్పుడు ఏకంగా 18 మంది సర్పంచ్ లు రాజీనామా చేయడం తీవ్ర చర్చనీయాంశం అయింది.
భారాసకు గుడ్ బాయ్ చెప్పిన 18 సర్పంచులు
