భారస ఆత్మీయ సమ్మేళనంలో మరో విషాదం

భారత్ రాష్ట్ర సమితి ఆత్మీయ సమ్మేళనాల్లో విషాదాలు చోటు చేసుకుంటునే  ఉన్నాయి. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడు లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు మృతి చెందగా , తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం చీకటి మామిడిలో భారస పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన ఓ కార్యకర్త గుండెపోటుకు గురై కన్నుమూశాడు. వివరాల్లోకి వెళ్తే.. సీఎం కెసిఆర్ ఆదేశాల మేరకు గత కొద్దీ రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున కార్యకర్తలను , ప్రజలను తరలిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని అనుకోని విషాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం చీకటి మామిడిలో భారస పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన కాంచల తండాకు చెందిన కార్యకర్త ధీరావత్ నాను సింగ్ గుండెపోటుతో మృతి చెందారు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో.. ప్రాథమిక చికిత్స అందించకుండా … ఆయ‌నను ఆసుపత్రికి త‌ర‌లిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయారు. ధీరావత్ నాను సింగ్ కు ముగ్గురు ఆడపిల్లలు. ఇంటి పెద్ద దిక్కు కోల్పోవడం తో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

 

Leave a Reply

%d