హైదరాబాద్ మధుర నగర్ పరిధిలో ఓ మహిళ వర్షంలో నడుచుకుంటూ వెళుతూ ఉండగా.ఓ కారు డ్రైవర్ కారు ఆపి ఎక్కడికి వెళ్లాలో చెబితే లిఫ్ట్ ఇస్తానని చెప్పాడు.మొదట ఆ మహిళ ఎటువంటి లిఫ్ట్ వద్దు అని ముందుకు నడుచుకుంటూ వెళ్ళింది. అయితే వర్షం కాస్త పెరగడంతో మళ్లీ ఆ కార్ డ్రైవర్ కాస్త ముందుకు వెళ్లి కారు ఆపి వర్షం ఎక్కువ అవుతోంది తడిచి పోతారు అంటూ మంచి వాడిలాగా కాస్త కలరింగ్ ఇచ్చాడు.
దీంతో ఆ మహిళ అతని నమ్మి కారు ఎక్కేందుకు అంగీకరించి వెనుకల సీట్లో కూర్చునేందుకు వెళ్లగా పర్వాలేదు ముందు సీట్లోనే కూర్చోండి అని డోర్ తెరిచాడు.ఆ మహిళ కారు ఎక్కిన తర్వాత మధ్యలో ఒక చిన్న పని ఉంది అది చూసుకొని వెళ్దామని చెప్పి ఓ నిర్జీవ ప్రదేశానికి తీసుకువెళ్లాడు.ఆ మహిళ ఎక్కడికి తీసుకెళ్తున్నావని ఎన్నిసార్లు అడిగినా ఆ డ్రైవర్ సమాధానం ఇవ్వలేదు. ఆ డ్రైవర్ ప్రవర్తన చూసి కాస్త భయపడిన మహిళ అరవడం మొదలు పెడితే చంపేస్తానని డ్రైవర్ బెదిరించాడు.
ఆ తర్వాత ఆ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.అనంతరం ఆ మహిళను కారులో నుంచి బయటకు తోసేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.ఆ మహిళను దయనీయ స్థితిలో చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ఆ మహిళను ఆసుపత్రికి తరలించారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆ ప్రాంతంలో ఉండే సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు.త్వరలోనే నిందితున్ని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.